Saturday, May 2, 2009

ఆ నీలగిరులలో ...


"ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే. పరధ్యానంగా నడుస్తున్నపుడు కస్సున గుచ్చుకునే ముల్లు నిరంతరం అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తుంది. అంతెత్తు కొండలు మనమెంత అల్పులమో గుర్తు చేస్తాయి. ఆ ఎత్తుకు చేరాలంటే యెంత కష్టపడాలో చెబుతాయి. పారే జలపాతం ఉత్సాహ రహస్యం. పండ్లతో ఒరిగిన చెట్లు పరోపకార స్పూర్తి "

ఇవి ఒక రోజు ఈనాడు లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి రాసినపుడు చదివిన విషయాలు. రాజ కుమారి దక్కినా, దక్కకపోయినా సాహసాలు మాత్రం చేసి తీరాల్సిందే అనుకునే వారి కోసమే
వై. హెచ్.ఏ.ఐ. ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. నాకు తెలియని విషయం ఏమిటి అంటే నాకు కొండలు, చెట్లు, నదులు అంటే ఇష్టమని. ఇది చదివిన వెంటనే ఎలాగయినా సరే ఈసారి ట్రెక్కింగ్ కు వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను. వెంటనే డి.డి తీసి చెన్నై కి పంపేసాను, వారం రోజులు లీవ్ అప్లై చేసేసాను. ఇక ప్రతి రోజు ఆలోచనలే, ప్రతి వారం షాపింగే. ఏప్రిల్-౨౬ (ఇరవై ఆరు) ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ... హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లి, అక్కడనుడి ఊటీ వెళ్దామని ప్లాన్. అంతా బాగానే అయ్యింది ... ఇరవై ఆరున ఊటీ లో అడుగు పెట్టాను ... దిగగానే ఆటో వాడు జలక్ ఇచ్చాడు ... ఊటీ బస్ స్టాండ్ నుండి యూత్ హాస్టల్ ఒక కిలోమీటరు కూడా ఉండదు, ముప్పై రూపాయలు తీసుకున్నాడు ... టైం మార్నింగ్ ఆరున్నర అయింది ... వాతావరణం ఆహ్లాదంగా ఉంది ... ఊటీ యూత్ హాస్టల్ బావుంది ... ఇప్పటివరకు మనకు తెలియని వాళ్ళు పరిచయం అవుతారు, ఎలా ఉంటారో, మన ట్రిప్ ఎలా ఉంటుందో ఇలా చాలా చాలా ఫీలింగ్స్ ...

అప్పటికే కార్తీక్ విజయవాడ నుండి వచ్చాడు ... తనను చూడగానే నాకు షాక్ ... ఎందుకంటె తను జస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ... అంతే ... ఊటీ చూద్దామని బయటకు వెళ్ళాను ... బ్లాక్ కలర్ స్వెట్టర్ కనిపించింది ... నచ్చింది ... కొనేసాను ... చిన్నగా వర్షం పడుతోంది ... ఇంతలో కందస్వామి, సుభాష్, సెంథిల్, ... వచ్చారు. బి.డి.ఎస్ చదువుతున్నారు. పరిచయం చేసుకున్నాను. రెండున్నరకు మహేంద్ర జీప్ లో పార్సన్స్ వ్యాలీ కు తీసుకెళ్ళారు. పదిహేను కిలోమీటర్లు, జర్నీ బావుంది.

ప్రక్క ఫోటో పార్సన్స్ వ్యాలీ బస్ క్యాంపు ఫోటో

చలిగా ఉంది. స్వెట్టర్ వేసుకుని, టీ తాగుతూ ఎంజాయ్ చేసాము, సాయంత్రం అవుతుంది. ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. నాకు ఎలా అనిపించింది అంటే మన ఇంట్లో పెళ్లి అవుతుంటే బంధువుల కోసం ఎలా వెయిట్ చేస్తామో అలా. రాత్రి డిన్నర్ అయిన తరువాత ఒక్కొక్కరి పరిచయం అయింది. ఎలా ఉండాలి, ఏమి ఏమి చెయ్యాలి అని చెప్పారు. అమ్మాయిల కోసం ఒక రూం, అబ్బాయిలకు సెపరేట్. నిద్ర పట్టడం లేదు. ఒకటే చలి. రెండు స్వెట్టర్ లు వేసుకున్నాను, అయినా సరే. రాత్రి పడుకునే ముందు పాలు ఇచ్చారు. రాధ ఆంటీ, రమ ఆంటీ, రామనాథ్, ఆదిత్య, ప్రసన్న ఎప్పుడో లేటుగా వచ్చారు. మొత్తం ముప్పయి మంది, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు. ఇవి నా మొదటి రోజు అనుభవాలు ...

నేను ఈనాడులో చదివాను, యూత్ హాస్టల్స్ లో అంత క్రమశిక్షణతో ఉంటారని. దానికి తగ్గట్టుగానే, ఉదయం (ఆరు) కల్లా విజిల్ వేసేస్తారు. ముందు టీ, తరువాత కాలకృత్యాలు, ఏడున్నరకు బ్రేక్ ఫాస్ట్, ఎనిమిదిన్నరకు లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇవాళ చాలా బావుంది. ఎందుకంటె, లైఫ్ లో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకో ఇవాళ లేట్ అయింది. లంచ్ చేసి బయలుదేరుతాం అట. అక్కడ పర్సన్స్ వ్యాలీ డం ఉంది, చూడడానికి అందరం బయలుదేరాం.

పన్నెండు గంటలకి బయలుదేరాం. చాలా, చాలా మంచి ఫీలింగ్. అందరికి థాంక్స్ చెప్పి, దేవుడిని ప్రార్థించి, ముందు పిల్లలు, ఆడవాళ్ళు, తరువాత అబ్బాయిలు అందరు ఒకే గ్రూపుగా బయలుదేరాం. నెమ్మదిగా మాట్లాడుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మధ్య, మధ్య చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటూ, సాయంత్రం నాలుగు గంటలకు ముకుర్తి చేరుకున్నాం.

మా మజిలిలో కొన్ని తీపి గురుతులు :







































మా మంచి గైడ్ - రమేష్
అందరూ ఇతనిని రమేష్ అన్నా, రమేష్ అన్నా అని పిలిచేవారు.










ఇవన్నీ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ సాయంత్రానికి
ముకుర్తి చేరుకున్నాం.

మా గురించి ఎదురు చూస్తూ సింగ్ గారు వెల్ కం చెప్పారు. రాగానే వేడి, వేడి టీ ఇచ్చారు. ఇక్కడ ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు తిరుగుతాయి, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అని చెప్పారు. దగ్గరలో డాం ఉంది. కనీసం బాత్ రూం కు కూడా వాటర్ లేదు, డాం కు వెళ్ళాల్సిందే.

ఇక్కడ రోజు మేము ఉండబోయే కాటేజ్ బావుంది, చుట్టూ అడవి, జంతువులు ఏమి రాకుండా ఫెన్సింగ్. నాకు అయితే బలే బలే నచ్చేసింది. వెంటనే ఫొటోస్ తీయడం మొదలు పెట్టేసాను.


చూడగానే నాకు ఇంగ్లీష్ సినిమాలు గుర్తుకు వచ్చాయి.
దయ్యం సినిమాలలో ఇల్లు ఇలానే ఉంటాయి. ముందు వరండా, మూడు గదులు. ఒకటి అమ్మాయిలకు, ఒకటి అబ్బాయిలకు, ఒకటి సింగ్ గారికి.

బాగ్ లోపల పెట్టి డాం చూడడానికి బయలుదేరాం, వాటర్ బాటిల్స్ పట్టుకుని. నది ప్రవహిస్తున్న చప్పుడు ప్రశాంత వాతావరణంలో చాలా బావుంది. ఇక్కడ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ల ఆఫీసు ఉంది. అక్కడి వాళ్లు చెప్పారు, రొజూ ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయని, ఫెన్సింగ్ ను తొక్కి వెల్లిపోతాయని.

వచ్చిన తరువాత అలాగే కబుర్లు చెబుతూ కూర్చున్నాం.ఎనిమిదిన్నరకు డిన్నర్. చపాతి & వెజ్ రైస్. ఇక్కడ క్యాంపు ఫైర్ వెయ్యకూడదు. తొమ్మిది కల్లా పడుకున్నాం. చాలా చలిగా ఉంది. మొత్తం కాటేజ్ అంతటికీ ఒకే ఒక లైన్ ఉంది. సో, లైట్ ఆఫ్ చెయ్యకుండానే పడుకున్నాం. చాలా చలిగా ఉంది. రగ్గులు, స్వెటర్లు సరిపోడం లేదు.

మూడు గంటలకు మెలకువ వచ్చేసింది. రెండు కారణాలు ఉనాయి. ఒకటి చలి అయితే, రెండవది ఏనుగుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒకవేళ ఏనుగులు గేటు ను విరగ్గొట్టి లోపలికి వస్తాయేమో అన్న ఆలోచనల వల్ల.
నా దగ్గర స్వాతి ఉంది. అప్పుడు చదవడం మొదలెట్టాను.


అప్పుడు తీసిన ఫోటో ఇది. మళ్ళా పడుకున్నాను.
ఉదయం ఆరు గంటలకు సింగ్ గారు విజిల్ వేసి అందరిని నిద్ర లేపెసారు.





























Continue Reading →

Sunday, March 29, 2009

Sunday, March 22, 2009

నా గురించి నేను . . .

మధ్య నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను ... ఎవరి గురించి ?? నా గురించే ! ఎందుకంటే చాలా మంది, ఆఫీసు లోను, ఫ్రెండ్స్ కూడా నువ్వు కొంచం తేడా గాడివి అంటున్నారు ... నాకు తెలుసు నేను చాలా విషయాలలో అందరిలా ఆలోచించను ... కొంచెం డిఫరెంట్ లే ... ఉదాహరణలు అవీ ఇవీ ఇవ్వలేను ... కాని, నాకు తెలుస్తూంది ...

ఒక ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి కూడా ఇదే మాట అంది ... వందమంది ఒక డైరక్షన్ లో చూపెడితే, నేను ఒక్కడినే మరోవైపు చుపెడుతాను అట ... అందుకు గొప్పగా ఫీల్ అవ్వాలి గాని, బాధ పడటం దేనికి ? అదేదో సినిమా లో హీరో పాట పాడతాడు లోకం అంతా ఒకవైపు ... నేను ఒక్కడినే ఒకవైపు అని ... పాటలు ఎంజాయ్ చేస్తారు గాని .... నిజంగా కనిపిస్తే ఒప్పుకోలేరు అనుకుంటా ... ప్రతి దానికి, నాకు తెలుసు ... నాకు సలహాలు ఇవ్వద్దు అని చెబుతున్నాను ... అది కరక్టే కదా ... ఎవరో ఏదో చెప్తే అది చెయ్యాలా ?? ఆఫీసు లోను అంతే, ఎవరి ఏది చెప్పినా నాకు నచ్చితేనే చేస్తున్నాను... వాడు చెప్పింది కరెక్ట్ అయినా, నాకు నచ్చకపోతే చేయడం లేదు.

ఇంకా, నా గురించి నేను తెలుసుకోవాల్సింది ఉంది అనుకుంటా ... ఒక ఇయర్ క్రితం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న ఇది ఉండేది ... అదేంటో, ఇప్పుడటువంటిది ఏమి లేదు ... లేస్తున్నామా, ఆఫీసు కు వెళ్తున్నమా, తింటున్నామా ... అంతే... ఇది నాకు నచ్చడం లేదు ... ఎక్కడో, ఏదో అసంతృప్తి ...

నా ఇంకొక భయం ఏమిటి అంటే ... నేను అంత త్వరగా ఎవరినీ ఇష్టపడను ... పవన్ గాడికి, సాయి కిషోర్ కు పెళ్లి సంబందాలు చూస్తున్నారు .... అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారంట, అంత తొందరగా దొరకట్లేదు అంట. మనకు ఇంకో రెండు ఇయర్ వరకు పెళ్లి ఆలోచన లేదు ... మరి అప్పటికి, మనకు నెత్తి మీద జుట్టు ఉంటుందా ? డౌటే !!! జుట్టు లేనివాడిని ఎవరు ఇష్టపడతారు ? ఎవరు ఇష్టపడ్డా, నన్ను ఇష్టడినవారిని నేను ఇష్టపడతానా ? మనతో పాటు, చివరివరకు ఉండాల్సిన వాళ్లు ... మనం ప్రేమించే, అభిమానించే, ఆరాధించే లక్షణాలు వారిలో ఉంటాయా ? బేసిగ్గా, నాకు పెద్ద కోరికలు ఏమి లేవు ... కొంచెం పొడుగ్గా (లేకపోతె, ముద్దు పెట్టుకోవడం కష్టం), కొంచెం తెల్లగా, కొంచెం అందంగా, అన్నిటిని మించి మంచి గా ఉంటే చాలు (నా ఉద్దేశం, అందరు అమ్మాయిలు చెడ్డవారు అని కాదు). ఇక్కడ మంచి అంటే ఏమిటి ? ఎవరు మంచి, ఎవరు చెడ్డ అని ఎలా డిసైడ్ చేస్తాం ? ఇది చాలా కష్టమయిన ప్రశ్న. జడ కొంచెం పొడుగ్గా, దట్టంగా ఉంటే ఇంకా హ్యాపీ !! (ఎక్కడో చదివాను, పెద్ద జడలను ఇష్టపడడం ఒక జబ్బు అని, అయినా సరే), కాళ్ళకు పట్టీలు ఇస్తపదేవారంటే ఇంకా సూపర్ ... జాబ్ చెయ్యకపోతే హ్యాపీ, చేసినా ఓకే (కాని, సాఫ్టువేర్ జాబ్ మాత్రం వద్దు) ... మొక్కలను ఇష్టపడాలి ... ఇంకా, మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తే ఇది తప్పు అని చెప్పాలి ... మరీ అంత ఫాస్ట్ కాకుండా ... మరీ అంత స్లో కాకుండా ... ఇంకా ఎలా అంటే, ఇప్పటివరకు నేను కథలు, స్వాతి లో సేరియల్లు చాలానే చదివాను ... అవి చదువుతున్నంత సేపు అందులో హీరోయిన్స్ భలే నచ్చేవారు ... ఎలా అంటే, యోధుడు లో మధురిమ లా, మహార్ణవం లో ఉమ లా, సెకండ్ మాన్ లో స్నేహ లత లా, అదేదో లో మాధవి లా. మనకు ఇటువంటివాళ్ళు దొరుకుతారా ? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటి అంటే వాళ్లు అందరు హీరోయిన్స్, కాని, ఇక్కడ మనం హీరో కాదే !!!

ఇప్పటివరకు అటువంటి వాళ్లు తగల్లేదా అంటే , నిజం చెప్పాలి అంటే, ఒకే ఒక్క అమ్మాయి అని చెప్పొచు ... నాకు ఇప్పటికి అనిపిస్తుంది అరే, అ అమ్మాయి అయితే యెంత బాగుండును అని ... కాని, మనం కోరుకున్న్వాన్ని దక్కితే, అది లైఫ్ ఎలా అవుతుంది ? ప్చ్, ఏం చేస్తాం ??? దేవుడు, ఇంకేవరినయినా పుట్టించాడేమో చూడాలి...

ఇక బావ చెప్పిన సంగతికి వద్దాం ... మనకి అదేదో పాదం లో చందమామ ఉందట ... దాని అర్థం, మనకు చందమామ అంత అందమయిన, మంచి అమ్మాయి వస్తుందట ! జాతకాలు ఎంతవరకు నిజమో, ఎంతవరకు నమ్మాలో , ఏమో ???
సో, మన పెళ్లి సంగతి , అమ్మాయి సంగతి బావ చేతిలోనూ, హేమ చేతిలోనూ పెట్టేద్దాం !!!

కథ ఎక్కడివరకు, ఎలా వెళ్తుందో చూద్దాం ...




Continue Reading →

Sunday, March 15, 2009

మా పవన్ గాడు ఉన్నాడు ... ఈ మధ్య కవితలు, కవితలు అని అంటున్నాడు ... ఏవేవో రాసి బాగా రాసానా, నేను కవిని అవుతానా అని చంపేస్తున్నాడు ... ఇవి వాడి సొంతవి అయిత ఓకే ... ఎక్కడో చదివినట్లు అనిపిస్తే తప్పు నాది kaadu

Like a lightning in the Sky, You have come and went, Leaving sweet pain in my heart. Your tender looks are still driving me crazy... Where are you....When can i find you ...

It is Spectacular...... Standing in the skyStars are singing for you....Moon is smiling at you....... To wish my lovely angel without wings an icredibly beautiful b'day.

అబ్బో ... ఇవి ఏంటి ... ఇంకా చాలా ఉన్నాయి ... ఇప్పుడు టైం లేదు ... వీలు చూసుకుని పోస్ట్ చేస్తా ...

Continue Reading →

సంక్రాంతి




లాస్ట్ సంక్రాంతి కి ఈనాడు లో వచ్చిన ఫోటో ఇది ... చాలా బావుంది కదా ... ఆ గుడి , పక్షులు, చెట్లు, ముగ్గులు, ... చిన్నప్పుడు చాలా బాగుండేది ... ఇప్పుడు ఎందుకో మరి పండగ అంటే ఆ ఫీల్ లేదు ... లైఫ్ ను సరిగా ఎంజాయ్ చెయ్యట్లేదు అనిపిస్తుంది గాని, మనం చిన్నప్పుడు బాగానే గడిపాం . ప్రతి శనివారం పండగలా ఉండేది ... బహుశా బాసిమామ వల్లనే ... ప్రొద్దున్నే లేచి, పూజ చేసి, చెల్లిని తీసుకుని ఆంజనేయ స్వామి గుడి కి వెళ్ళేది ... ఊరు అంతటికీ వినిపించేలా రేడియోలో సుప్రభాతం పెట్టేది ... తను ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండును అనిపిస్తుంది ... తను ఎప్పటికి ఉండేలా ఏదో ఒకటి చెయ్యాలి ... చేద్దాం ...


Continue Reading →

చివరికి


లైఫ్ లో కొన్ని ఎంత ట్రై చేసిన అవ్వవు ఏమిటో మరి ... నాకు అర్థం కాదు ... అందులో ఇది ఒకటి ... అర్థం కాలేదు కదా ... నాకు తెలుసు ...

మనం కొన్ని యెంత ట్రై చేసినా అవ్వవు ... అది అమ్మాయి విషయం అయినా, బైక్ విషయం అయినా ... ఇంత వేదాంతం ఎందుకు అంటే, అది అంతే ... మనకు వచ్చినవి మనం తీసుకోవాలి అంతే ...


Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts