Sunday, January 31, 2010

వెన్నెల రాబోతుందా ?

నేను ఏమి బావను కాను, అందంగా కవితలు చెప్పడానికి. ఫీలింగ్స్ ఏమి లేని వాడిని కాదు ఏమి చెప్పకుండా ఉండడానికి . నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్న వాడిని !!!

లాస్ట్ వారం రోజుల నుండి నా ఆలోచనలు అన్నీమారిపోయాయి నీ ఆలోచనలతో . బావ ఒకరోజు ఉదయాన్నే కాల్ చేసి చాలా మంచి సంబంధం అట అని నీ గురించి చెప్పేటప్పటికి నేను ఎదురు చూస్తున్న చందమామ నువ్వేనా అనిపించింది !!! నా తూర్పు గోదావరి లో పుట్టిన, కళ్ళజోడు పెట్టుకున్న, పొడుగు జడ ఉన్న, అందమయిన వెన్నెల కురిపించే అమ్మాయివి నువ్వేనా అనిపించసాగింది. అంత లోనే ఎన్నో అనుమానాలు, భయాలు !!! ఇద్దరికీ మధ్య ఏడు సంవత్సరాలు డిఫరెన్సు. తప్పు ఏమో అని. అమ్మ చెప్పింది పది సంవత్సరాలు కూడా ఉంటాయి అని. ఎలాగో కన్విన్స్ అయిపోయాను. ఇంజనీరింగ్ అవకుండానే అప్పుడే పెళ్లి చేసెయ్యడానికి అంత తొందర ఏమిటి ?

నీ ఎత్తు అయిదు అడుగుల ఏడు అంగుళాలు అట. మామూలుగా ఇంత ఎత్తు ఉన్న అమ్మాయిలూ దొరకడం కష్టమే !!! నాన్న నిన్ను సపోర్ట్ చేయడానికి నీ యత్తే కారణం. నీకు కళ్ళజోడు ఉందట. అమ్మకు ఎందుకో నచ్చావో తెలియదు, తనతో మాట్లాడితే ఈ రోజుల్లో అది అందరికీ కామన్ అని నన్ను కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. తనకు తెలియదు నాకు ఎందుకో కళ్ళజోడు ఉన్నవాళ్ళు అంటే ఇష్టమని.

భారతి అత్త నీ ఫోటో చూసి అనాలసిస్ చేసింది. ఏదో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావట. ఆంజనేయ స్వామి బొట్టు నుదిటి మీద, మెడ మీద ఉంది. అంటే నీకు దైవ భక్తీ ఉంది. వేలికి uనగరం ఉంది. అంటే గ్రహాల పట్ల, నమ్మకం ఉంది. మన వాళ్లకు పంపిన ఫోటో స్టుడియోలో తీసింది కాదు. ఇంట్లో తీసింది. అంటే నీ వెన్నెల నిజమయిందే !

సాధారణంగా స్టుడియోలో తీసిన ఫోటోలు అంత నిజం కాదు. మామూలు ఫోటోలోనే ఇంత అందంగా ఉంటే నిజం గా ఎలా ఉంటావో ?? అత్తకు సాధారణం గా ఎవరూ నచ్చరట, ఐశ్వర్యా రాయ్ అయినా !!! అటువంటిది నువ్వు నచ్చావంటే అమ్మో ఎలా ఉంటావో ?? వాళ్ళు ఏలూరు వెళ్తే, ఎవరో తెలిసిన వాళ్ళు నీ గురించి చెప్పారట. బావ అంటున్నాడు, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా నీ గురించి చెప్పారంటే నువ్వు ఎలా ఉంటావో ?? అత్తకు, అమ్మకు, నాన్నకు, మామకు అందరికీ నచ్చేసావు. నువ్వు ఎలా ఉంటావో ?

అనవసర బయాలు అంతలోనే ! నీ జాతకం, నా జాతకం చూసి ఇద్దరికీ అంత కలవలేదు అని ఎవరో చెప్పారు. బయపడ్డాను. అయినా నన్ను నేను కన్విన్స్ చేసేసుకున్నాను. ఏమో ఎప్పుడో ఇరవయి సంవత్స రాల క్రితం నువ్వు పుట్టిన టైం కరెక్ట్ గా నోట్ చేసారు అని గారంటీ ఏమిటి. ఒక్క సెకను తేడా వచ్చినా జాతకాలు మారిపోతాయి. అటువంటిది జాతకాలను ఎలా నమ్మను ? మీ వాళ్ళు జాతకాలు చూడరు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. దేవుడా థాంక్స్ !!! నీ గురించి మాటలాడుతుంటే బావ చేతిలోని ఫోను కింద పడి ముక్కలు అయిపోయిందట.

నిన్ను చూడడానికి ఇంకో పది రోజులలో మన గాంగ్ కాకినాడ బయలుదేరుతున్నారు. ఏమవుతుందో ?? వీళ్ళు అందరి మాటలతో నాకు ఏమి అనిపిస్తుందంటే నీ ఫోటో అయినా చూడకుండా నిన్ను చేసేసుకోవాలని !!! నీ జాతకం లో ఈ సంవత్సరం పెళ్లి కాదు అని ఉందట. ఈ మాటే నన్ను బయపెడుతుంది. కాని ఒకటి నిజం. దేవుడు ఎవరిని రాసి పెడితే వాళ్ళతో జరుగుతుంది. చూద్దాం ఏమి జరుగుతుందో !!! లాస్ట్ ఇయర్ ఒకతను చెప్పాడు నాకు, "నీ పెళ్లి ముందు చాలా ప్రొబ్లెంస్ ఉంటాయి అని". ఎటువంటివి అయినా క్లియర్ చేసేయొచ్చు, బావ హెల్ప్ తో.

కాని నేను నీకు నచ్చానా ? నువ్వు నాకు నచ్చుతావా ? వేరే అమ్మాయి గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు. నీ గురించి నా బ్లాగులో రాసాను అంటే నువ్వే నా చందమామ అని నమ్ముతున్నాను. ఇప్పటివరకూ నీ అందం గురించి తప్ప , నీ వ్యక్తిత్వం, ఆలోచనలు, ఇష్ట ఇష్టాలు ఏమి మాట్లాడలేదు. తూర్పు గోదావరిలో, మంచి కుటుంబం లో, చందమామను కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్న నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉంటావని నమ్ముతున్నాను.

ఇవీ నీ గురించి నా ఆలోచనలు. టైం తెల్లవారు జామున మూడు అయింది. రేపు ప్రొడక్షన్ లో పెద్ద ఇన్ స్టాల్ ఉంది. పడుకోవాలి. దేవుడు ఏమి చేస్తాడో చూద్దాం !!!

Continue Reading →

అన్నయ్య ! ఏంటి ఇలా చేస్తున్నావు ??

అదేంటో చిరంజీవి ఇలా తయారయ్యాడు !!! చిరంజీవి అంతే చాలామందికి ఇష్టం, అన్నయ్య చేసే స్టెప్పులు ఇష్టం, అన్నయ్య చేసే ఫయిట్స్ ఇష్టం, అన్నయ్య చెప్పే మాటలు ఇష్టం, అన్నయ్య చేసే సేవ ఇష్టం, సినిమాలలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా మెగా స్టార్ అయిన నీ కష్టం ఇష్టం, పాతిక సంవత్సరాలు అయినా నువ్వు చేసిన పాటల్లో ఉండే హుషారు ఇష్టం.


అటువంటి అన్నయ్య ప్రజా సేవ చేస్తానంటూ కంపు కొట్టే రాజకీయ ట్రైన్ ఎక్కి అసెంబ్లీ లోకి వెళ్లావు. పార్టీ పెట్టే ముందు తెలంగాణా ప్రజలు కోరుకుంటే సెపరేట్ స్టేట్ ఇస్తానన్నావు. వేరే పార్టీలలో సీట్లు రావు అనుకున్న వాళ్ళు వస్తే తీసేసుకున్నావు. కాని తెలంగాణా లో ఒక్క సీట్ కూడా రాలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చేసే ఒత్తిడికి లొంగి, నేను తప్పటడుగు వేసాను తప్ప తప్పుటడుగు వేయలేదు అని మాట మారుస్తూ, మిగతా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు.

ప్రజా సేవ అంటే నీకు ఉన్నది కూడా అమ్మి అవసరం అయిన వాళ్లకు ఇవ్వడం. నీ బావమరిది మంచి నిర్మాత కావచ్చు. కాని మంచి ప్రజా సేవకుడు కాదు. అసలు ఏమి చేద్దామని అనకాపల్లి లో పోటి చేసాడు. కనీసం ఒడిపోయిన తరువాత ఒక్కసారి అయినా ప్రజల మొహం చూసాడా ?

నీ తమ్ముడు సభలలో, సమావేశాలలో అన్నయ్య, శక్తి అంటుంటాడు. యువ రాజ్యం అధ్యక్షుడు అయ్యాడు. ఎన్నికలు అయిన తరువాత ఒక్కసారి అయినా ప్రజల మొహం చూసాడా ?

నేను ఏమి సెపరేట్ స్టేట్ కావాలి అనేవాడిని కాదు, వద్దు అనే వాడిని కాదు, నీ అభిమానిని. నీకు మంచి జరగాలి అని కోరుకునే వాడిని. దేవుడు నిన్ను మంచి దారిలో నడపాలి, నీ వల్ల కొందరికి అయినా మంచి జరగాలి.

Continue Reading →

పవన్ - గుంటూరు పచ్చిమిరపకాయ ...

ఎవరయినా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను ఆలోచనలో పడతాను. ఫ్రెండంటే సినిమాలలో లాగా త్యాగాలు చెయ్యాలా ?, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను కూడా ప్రేమించి, నీ కోసం వదిలేయాలా ? ఏమో, అలాంటి వాళ్ళు ఎవరు నాకు లేరు. కాని వీడి పేరు చెప్పకుండా ఉండలేను. నాకు ఫ్రెండా ? క్లాసు మేటా ? ఒకప్పటి రూం మేటా ? అన్నీను !!!

మా స్నేహం వయసు ఆరు సంవత్సరాలు. అది రెండువేల మూడు, సెప్టెంబర్ నెల. ఎం.సి.ఏ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. ముందు మాటలాడు తుంటే సొల్లు చెబుతున్నాడు అనిపించింది. నేను ఉండే మా బావ రూం, వీడు ఉండే వాళ్ళ అన్న ఇళ్ళు దగ్గరే. మొదట్లో ఆ విషయం నాకు తెలుసు. కాని నేను ఎక్కడ ఉండేది చెప్పలేదు. ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అని. సమయం అలా గడిచిపోయింది. నేను గమనించింది ఏమిటి అంటే వీడికి కేర్ లెస్ నెస్ ఎక్కువ, డబ్బులు అంటే అంత విలువ లేదు, సొల్లు చెబుతాడు అని. కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఎటువంటి సమయంలో అయినా నిద్ర పోగలడు. గుర్రాలు నిలుచుని నిద్ర పోతాయంట. కాని అవి నడుస్తూ నిద్ర పోలేవు. వీడిని చూస్తే అనిపించేది, అలా చేయగలడు అని. అంత ఫాస్ట్ గా నిద్రలోకి జారుకుంటాడు.

మొదట్లో అమ్మాయిల హాస్టల్స్ చుట్టూ తిరిగే వాడు. వెంటనే కొత్త పేరు వచేసింది, గాలి అని. ఇప్పటికి మేము అలాగే పిలుస్తాము. నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే కూల్ గా ఉంటాడు, అన్ని వేళలా. చాలా మంది అలా ఉండలేరు. మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బాగా ఇమిటేట్ చేసేవాడు. ఇంకొకటి సినిమాల పిచ్చి. తన లక్ష్యం [అని చెప్పేవాడు] సినిమాకు దర్శకత్వం చేయాలి అని. చూడాలి ఏం చేస్తాడో ??? జాని సినిమాలో చివరి సీన్ ఉంటుంది, ఓక పిచ్చుక పూల మొక్క మీద నుండి ఎగిరిపోతుంది, స్వేచ్ఛగా. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ సృజనాత్మకత కనిపిస్తుందట. వీడు ఏమి డైరెక్ట్ చేయకపోతే ఒక తీయించాలి.

క్రికెట్ బాగా ఆడతాడు. ప్రస్తుతం ఓక సాఫ్టువేరు కంపెనీ లో పని చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది వీడు సొల్లు చెప్పే విధానం, ప్రతి ఆదివారం నాడు క్రికెట్ కోసం జనాలను పోగుచేసే విధానం, అమ్మాయిలతో మాటలాడే పద్దతి, ఎవరయినా ప్రాబ్లం లలో ఉంటే వాళ్ళను ఊరడించే మాటలు - ఇవన్ని చూస్తుంటే వీడు చేసే జాబు సూట్ కాదు ఏమో అనిపిస్తుంది.
mఅంచి మేనేజర్ అయితే బావుండును.

ఇదంతా చదువుతూంటే ఇందులో రాసిన దానికి, నా ఫ్రెండ్ అవడానికి సంబంధం లేదు కదా అనుకుంటున్నావా ? అదంతే !!!
Continue Reading →

Monday, January 25, 2010

మీనింగ్ లెస్ కిస్ ...


Music & Lyrics

I saw you across the dancefloor
Out of the corner of my eye
I felt the connection
I don't know how, I don't know why
I shouldn't of stayed
When I saw you there with another man
But as we slipped away
I thought I heard you say
This wasn't part of the plan

CHORUS:
Just a meaningless kiss
It wasn't suppose to end up like this
Just a meaningless kiss
Ohh Ohh
Just a meaningless kiss
We knew it was wrong
But we couldn't resist
Just a meaningless kiss
Til I fell in love
With you

But you didn't want me to
Oh no

And here we are two years later
Too late to turn back now
We gotta finish what we shouldn't have started
We got to walk away somehow
But it's easier said than done
When two hearts beat as one
And three hearts are one too many
That's why we shouldn't have ever begun

CHORUS:
Just a meaningless kiss
It wasn't suppose to end up like this
Just a meaningless kiss
Oh oh
Just a meaningless kiss
We knew it was wrong but we couldn't resist
Just a meaningless kiss
Til I fell in love
With you

We can't go on like this forever
When we're not meant to be together
So leave me here on my own
From now on I guess I got to dance alone

CHORUS:
Just a meaningless kiss
It wasn't suppose to end up like this
Just a meaningless kiss
Oh oh
Just a meaningless kiss
We knew it was wrong but we couldn't resist
Just a meaningless kiss
But I'm still in love
With you

No matter what I do

Continue Reading →

Sunday, January 24, 2010

అందమయిన అమెరికా ...

అప్పుడెపుడో ఎక్కడో చదివాను, ప్రపంచంలో చదువుకున్న వాడు, చదువు లేనోడు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, వాడు వీడు అని తేడా లేకుండా అందరికి తెలిసిన ఒకే ఒక్క దేశం అమెరికా ... అమెరికా అంటే ఫ్రీడం, అమెరికా అంటే ఒకడి టాలెంట్ కు సరిపడా రెకగ్నిషన్ దొరికే దేశం, అమెరికా అంటే డబ్బు. ఇవీ నేను విన్నవి, నాకు తెలిసినవి. అటువంటి అమెరికా వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా మినహా యింపు కాదు.
చిన్నప్పడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నపుడు అనిపించేది, అసలెలా ఉంటుందో చూడాలని...కాని ఎప్పుడూ ట్రై చెయ్యలేదు, అవకాశం వచ్చింది. ఎలా పని చేస్తానో అనుకుంటూనే అడుగుపెట్టాను. ఫస్ట్ టైం కదా, ఎందుకో చాల టెన్షన్ , ప్రెజర్ ఫీల్ అయ్యేవాడిని. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వచ్చి రాగ్గానే నాకు నచ్చేసినవి రెండు విషయాలు. ఒకటి ఇక్కడి రోడ్లు. ఓక కారు రెంట్ కి తీసుకుని అమెరికా అంతా చుట్టేయాలి అనిపిస్తుంది.. డ్రైవింగ్ రానందుకు ఎన్ని సార్లు తిట్టుకున్నానో నాకే తెలియదు. అనిపిస్తుంది ఓక మంచి కారు తీసుకుని, మంచి పాటలు పెట్టుకుని, రాత్రి పగలు అలా వెల్లిపోతూనే ఉండాలి. ఎప్పటికి తీరుతుందో ఈ కోరిక ???
రెండు, ఇక్కడ అమ్మాయిలు. అదేంటో ఆపిల్ కలర్ లో ఉంటారు. ఇక్కడకు వచేముందు బావ చెప్పాడు, ఇక్కడ అమ్మాయిలు అదేకో శిల్పం చెక్కినట్లు ఉంటారు అని. చూసిన తరువాత తెలిసింది నిజమని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మేకప్ ఎక్కువ. అదే పని గా చూడడం తప్పు అని తెలిసినా చూడకుండా ఉండలేం.
Continue Reading →

ప్రమోషన్స్ ...


అప్పుడపుడు నాకు అనిపిస్తుంటుంది కొన్ని కంపెనీ లలో ప్రమోషన్స్ బుల్ షిట్ అని. అవి ఓక మనిషి పెర్ఫార్మన్స్ మీద కాకుండా ఇంకా చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది ... ఓక సంవత్సరం లో ఎంత మందికి ఇవ్వాలి, ఏ ఏ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు ఎన్ని ఇవ్వాలి అన్ని ముందే డిసైడ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ ఏ అయినా, బాగా పని చేసిన వాళ్లకు కూడా డిస్కషన్ రూం లోకి పిలిచి తొక్కలో రీజన్స్ చెప్తారు. జనరల్ గా, ఒకడు ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్ట్లో ఉంటే వాడికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ... అలా కాకుండా మూడు సంవత్సరాలలో మూడు ప్రాజెక్ట్స్ మారితే వాడికి కష్టమే !!!

పైన చెప్పినవన్నీ నా విషయం లో కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నప్పటికీ, అదేదో ఆక్రోశం తో చెబుతున్నది కాదు, నిజం. ఓక సారి ప్రాజెక్ట్ మారితే నీ గురించి పట్టించుకోనేవాడే ఉండడు. చాల మందిని చూసాను, అప్ప్రైజాల్ టైం లో పాత మేనేజెర్స్ చుట్టూ తిరగడం.

నేను నమ్ముతాను, నీ పని నువ్వు బాగా చెయ్యడం అంతే నువ్వు చెయ్యవలసింది. దానిని బట్టి నీకు ఏ రేటింగ్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలా, వద్దా ఇవి డిసైడ్ చెయ్యడం మేనేజర్స్ పని. అలా కాకుండా, నేను ఇది చేసాను, అది చేసాను, నాకు ఎందుకు ఇవ్వరు ఇలా అడుక్కోవాల్సి వస్తుంది. ఇది కర్రేక్తో, కాదో నాకు తెలియదు.

Continue Reading →

Thursday, January 21, 2010

లీప్ ఇయర్ ...


బేసిగ్గా ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాను, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్...ఇప్పటి వరకూ నాకు తెలియదు...అవి అంత బావుంటాయి అని...ఏ.ఎం.సి ౩౦ లో సినిమా చూడడానికి వెళ్ళాం..."లీప్ ఇయర్" ... థియేటర్ లో అడుగుపెట్టాను ... నేను మూడో వాడిని ... స్టార్ట్ అయింది ... హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఐర్లాండ్ లో ఏదో కాన్ఫరెన్స్ లో ఉంటాడు ... ఓక నమ్మకం ఉంటుంది, ఏ అమ్మాయి అయినా ఫెబ్రవరి "౨౯" న ప్రొపోజ్ చేస్తే అబ్బాయి వద్దు అనకూడదు. ఈవిడ వాడికి చెబ్దాం అని బయలుదేరుతుంది. మధ్యలో పెద్ద తుఫాను వచ్చి విమానం డబ్లిన్ దగ్గరలో దిగిపోతుంది. ఈవిడ ఓక పడవ మాట్లాడి బయలుదేరుతుంది. అది కూడా తిన్నగా వెళ్ళకుండా వేరేచోటికి వెళ్ళిపోతుంది.


అక్కడ మన హీరో ఉంటాడు, ఓక చిన్న హొటల్ నడుపుతూ ఉంటాడు. ఈమె వెళ్లి డబ్లిన్ వెళ్ళడాని కి టాక్సీ ఉన్నాయేమోనని అడుగుతుంది. హీరో డబ్బులు కట్టకపోవడం తో రేపు క్లోజ్ అయిపోతున్దబోతుంది. వీడు డబ్బుల కోసం సరే, తన కారులో తీసుకువెళ్తాను అంటాడు. మధ్యలో కారు ఓక గుంత లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అలా నడుచుకున్తూనే ఓక రైల్వే స్టేషన్ కు వెళ్తారు. కాని ఆ రోజు కి ఇక ట్రైన్స్ ఉండవు. సరే అని, ఓక ఇంటికి వెళ్తారు. అక్కడ తెలుస్తుంది, వాళ్ళు కపుల్స్ కే స్టే ఇస్తారు. వెంటనే అబద్దం చెబ్తారు - మాకు పెళ్లి అయింది అని. ఆ రోజు డిన్నర్ లో మొత్తం మూడు జంటలు ఉంటాయి. వాళ్ళు మాములుగానే ముద్దులు పెట్టుకుంటారు. వీళ్ళను కూడా కిస్ చేయమంటారు. కాని వీళ్ళు నిజమయిన కపుల్స్ కాదు కదా. కొంచం ఇబ్బంది పడతారు. బలవంత పెట్టేటప్పటికి కొంచం, కొంచం గా మొదలు పెట్టి, ఘాడంగా ఇంగ్లీష్ కిస్ పెట్టేసుకుంటారు. అబ్బా, ఆ సీన్ చూస్తుంటే అనిపిస్తుంది మనం ఎప్పడు కిస్ చేస్తాం అని ... ఆ ఫీలింగ్ రాకపోతే ఒట్టు ...
దారిలో అడుగుతాడు, నువ్వు ఉన్న ఇల్లు కాలిపోతుంటే , నువ్వు ఏది కాపాడుకున్తావు అని. ఏమి చెప్పలేకపోతుంది. అలా, అలా ఇద్దరికీ ఇష్టం మొదలవుతుంది. చివరకు ఆమెను డబ్లిన్ తీసుకెళతాడు. ఆమెకు ప్రోపోసే చేద్దాం అనుకున్నంతలో డాక్టర్ బాయ్ ఫ్రెండ్ వచ్చి 'విల్ యు మేరీ మీ ? ' అని రింగ్ ఇచ్చి ప్రొపోజ్ చేస్తాడు. ఇది చూసి మన హీరో పగిలిన గుండెతో వెళ్ళిపోతాడు.
ఎంగేజ్ మెంట్ పార్టీలో ఆమె కు ఎందుకో డౌట్ వచ్చి వీడికి ఓక టెస్ట్ పెడుతుంది. ఫైర్ అలారం ఆన్ చేస్తుంది. ఈ డాక్టర్ గాడు ఫోను, కంప్యూటర్ జాగ్రత్త చేస్తాడు తప్ప ఈమెను పట్టించుకోడు. ఆమె రియలైజ్ అయ్యి హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది. వాడు అక్కడ హోటల్ బాగా నడుపుతున్డాడు.
సినిమా అయిపోతుంది ... ఓక అందమయిన ముద్దుతో ... ఇందులోని సీన్స్ చాలా సార్లు చూసినప్పటికీ, అందమయిన హీరోయిన్, అంతకంటే అందమయిన ఐర్లాండ్ నేచర్ చూస్తేయ్ లైఫ్ లో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది . . .



Continue Reading →

Monday, January 11, 2010

మ్యాగి నూడుల్స్ ... కరోనా బీర్ ... చిరంజీవి పాట ...

సరిగా తిని చాలా రోజులయింది ... బహుశా రెండు వారాలు ... బావ దగ్గరకు వెళ్ళినప్పుడు అనుకుంటాను ... ఆదివారం ... లేచేటప్పటికే పన్నెండు అయింది ... విపరీతంగా ఆకలేస్తుంది ... వంట రాకపోడం పెద్ద తప్పు ... చిన్నప్పడు ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళినా అమ్మ తిట్టేది ... అందుకే ఇప్పుడు ఇలా తయారయ్యాం ... నిన్న జితన్ చెప్పాడు, నూడుల్స్ ఎలా చేయాలో ... ట్రై చేద్దాం అనిపించింది ... ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి . మరో పక్క నూడుల్స్, బటానీలు ఉడకబెట్టాలి. కొంతసేపటికి ఏమి అవుతుందంటే నూడుల్స్ సెపరేట్ గా విడిపోతాయి. ఇప్పడు కొంచం ఆయిల్ వేసి జీలకర్ర వేయించాలి, తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఒకదాని తరువాత మరొకటి
వేయించాలి. అవి కొంచం దోరగా, ఎర్రగా అయిన తరువాత ఉడికిన నూడుల్స్, బటానీలు కలిపేయాలి. కొంచం సేపు అయిన తరువాత, సాల్ట్, మసాలా కలిపేయాలి. మంట కొంచం తగ్గించి మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేయాలి.
idamtaa స్టొరీ కి సగమే. నెక్స్ట్, ఫ్రిజ్ నుండి చల్ల, చల్ల ని కరోనా బీర్ ఓపెన్ చేయాలి. ఫ్రెష్ ఫార్మ్స్ లో కొన్న, జుసి నిమ్మ కాయలు కట్ చేయాలి. నెమ్మది, నెమ్మదిగా నిమ్మకాయను పిండాలి. బాగా కలపాలి.
ఇక ఫైనల్ పార్ట్. నూడుల్స్ లో నిమ్మ రసం పిండి, కరోనా పట్టుకుని కంప్యూటర్ ముందు కూర్చోవాలి. 'యు ట్యూబ్' ఓపెన్ చేసి, చిరంజీవి గ్యాంగ్ లీడర్ అని టైపు చేసి, 'చికి చికి చెలం' సాంగ్ సెలెక్ట్ చేసి, వోల్యుం బాగా పెంచి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వేడి, వేడిగా తినేయాలి ... ఆనందం నీ సొంతం ...
Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts