Wednesday, August 18, 2010

ఇవాళ ఏం జరిగిందంటే ...

ఆఫీసు లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంతకు ముందు ఒక సారి ఇచ్చాను గాని ఇప్పుడు భయం వేసింది. ఏం కాదు, ఏం కాదు,  వెళ్ళు వెళ్ళు అని చెప్పుకుంటూ లోపలకు వెళ్ళాను. ఒక ఫాం ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది - గత సంవత్సర కాలం లో ఇండియా కు వెళ్ళావా అంది ? ఎందుకో అర్థం కాలేదు.  లేదు అని చెప్పాను. ఫాం లో చాలా ప్రశ్నలు ఉన్నాయి - నువ్వు UK వెళ్ళావా , mexico  వెళ్ళావా,  ఆ రోగం ఉందా, ఇది ఉందా అని.  అంతా పూర్తి చేసిన తరువాత నువ్వు ఇక్కడకు వచ్చి యెంత కాలం అయింది అంది. మూడు సంవత్సరాల నుండి ఇక్కడ లేకపోతే డొనేట్ చేయడానికి పనికి రావు అంది.  అన్నిటి కన్నా ముందు అడగాల్సిన ప్రశ్న ఇదే కదా అనుకుంటూ బయటకు వచ్చేసా !!!  అప్పుడు చెప్పింది, ఇండియా లో మలేరియా ఎక్కువ కదా, మా కొలీగ్స్ అందరికి వచ్చేసింది, అందుకే అడిగాను అని.

ఇదీ మా ఆఫీసు ఫోటో.

వస్తూ ఉంటే సీతాకోక చిలుక లు వాలీబాల్ ఆడుతూ కనిపించాయి.  అరే భలే ఆడుతున్నారే అని  కొంతసేపు చూసాను.  నాకు వీళ్ళను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది.  మన లంచ్ టైములో పరుగెడుతూ ,  జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజ్ లు చేస్తూ,  బాస్కెట్ బాల్, వాలీ బాల్ ఆడుతూ  శరీరాన్ని తీగ లాగ ఉంచుతారు.  తప్పు అని తెలిసినా కళ్ళు అప్పగించకుండా ఉండడం కష్టమే. మా హేలు చెప్పేవాడు.


కంటికి మంచిది, చూడు చూడు అని.
Continue Reading →

Monday, August 16, 2010

చెత్త నా కొడుకుల్లారా ...

నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు - కాని, అది నాది.  తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది.  మామూలు గా నాకు కోపం రాదు.  వీళ్ళను  ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం.  కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా.  దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు.  లేక పొతే ఇది నాది అన్న ఫీలింగ్ వల్ల నేనే మరీ అంతగా ఆలోచిస్తున్నానా ???   అప్పుడు నాకు అనిపిస్తుంది,  "చెత్త నా కొడుకుల్లారా,  డోర్ వేస్తే చాలు, పగలగొట్టనవసరం లేదు" అని. కాని ఏమి అనలేను. అందుకే నా ఆక్రోశాన్ని ఇలా రాసుకుంటున్నాను.  
Continue Reading →

చికాగో ఎయిర్ షో

ప్రతి సంవత్సరం చికాగో లో ఎయిర్ షో జరుగుతుంది అట. గత సంవత్సరం నేను వచ్చేటప్పటికే అయిపోయింది. ఈ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగు, పదిహేను రోజులలో జరిగింది. అసలిప్పటివరకూ  ఇటువంటివి చూడలేదు. మనకు నేవీ డే అని వైజాగ్ లో డిసెంబర్ లో జరుగుతుంది. కాని ఎప్పుడూ వెళ్ళలేదు. మన ఎయిర్ షో లు బెంగళూరు, హైదరాబాద్ లో అయినట్లు గుర్తు. కాని చూడలేదు. అప్పుడు ఎల్.సి.ఏ,  ధ్రువ్ హెలికాప్టర్ లూ చాలా బావున్నాయి అట. 

ఆదివారం వెళ్దాం అనుకున్నాం.  నాకు మాత్రం మహా ఎక్సైటింగ్ గా ఉంది.  మిచిగాన్ లేక్ పైన ... నీలి నీలి ఆకాశం లో ... అంతెత్తున చేసే విన్యాసాలు ఎలా ఉంటాయి అని, అదీ కాక ఇది అమెరికా నేవీ, ఎయిర్ ఫోర్సు ఈవెంట్స్.  నాకు అంత నాలెడ్జ్ లేదు కాని ... అమెరికా సూపర్ పవర్ కదా ... ఎఫ్.16  లు, ఎఫ్ 18  లు,  B1 బాంబర్ లు,  ఇంకా ఎన్నో,  ఎన్నెన్నో ... అవి అన్నీ ఎలా ఉంటాయో చూడాలి అని ...  నిన్న ఎలా ఉందొ నాకు తెలియదు కాని,  ఇవాళ బావుంది కాని, మరీ అంత బాలేదు.   పదకొండు కల్లా  డౌన్ టౌన్ చేరుకున్నాం.  వాతావరణం బావుంది , మరీ అంత ఎండగా లేకుండా,  మబ్బులు లేకుండా  నీలం గా ఉంది.  
  
కంబర్ ల్యాండ్ స్టేషన్ లో కారు పార్క్ చేసి లోకల్ ట్రైన్ లో డౌన్ టౌన్ చేరుకున్నాం.  అప్పడు  తీసిన ఫోటో.  ఎప్పుడూ హై వే ఫోటో తీయలేదు. చిన్నప్పుడు ఎప్పుడో అమెరికా అల్లుడో, ఇంకేదో  సుమన్ సినిమా టైటిల్స్ వచ్చేటపుడు  చూపెడతాడు. ఇంత కాలానికి నేను ఫోటో తీయగలిగాను. 

స్టేషన్ లో దిగి,  కారు మాట్లాడుకుని లేక్ షోర్ దగ్గర దిగాం.  అప్పటికే మొదయిపోయింది. ఎక్కడ చూసినా జనం, పోలీసులు.   మామూలే.  వేసవి కదా, బట్టలు విప్పేసి

స్నానాలు చేసేస్తూ ఉంటారు.  ఎండ మరీ అంత ఎక్కువగా లేదు కాని ఎక్కువగానే ఉంది.  చిన్న, చిన్న విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి.  బానే ఉంది అనిపించింది.  పొగలు వదులుతూ, రక రకాల షేపు లలో .
వీటిని ఏమి అంటారో నాకు తెలియదు. 

ఇవి అయిపోయిన తరువాత మూడు హెలి కాప్టర్లు వచ్చాయి - సొగసు గా ఎగురుకుంటూ.
ఏవేవో చేసేస్తాయి అనుకున్నాను.  కాని ఏమి జరిగిందంటే  మూడు ప్రక్క, ప్రక్క నీటికి కొంచం ఎత్తులో నిల్చున్నాయి కొంతసేపు.
అంతకు మించి ఏమి చేసాయో నా బుర్రకు అర్థం కాలేదు. కాని బావున్నాయి, నల్లగా, మూడు ప్రక్క ప్రక్క నే నిల్చుని.                కొంత సేపు అయిన తరువాత ఆరెంజ్ కలర్ లో ఒక రెస్క్యు హెలికాప్టర్ వచ్చింది. ఒకడు నీటిలో దూకాడు,  వీళ్ళు వాడిని తాడు వేసి పైకి లాగాడు, వాడు చేతులు ఊపుకుంటూ లోపలి వెళ్ళిపోయాడు.  

ఇంకొంచం సేపు అయిన తరువాత అదేదో ట్రాన్స్ పోర్ట్ విమానం లా ఉంది. నెమ్మదిగా ఎగురుకుంటూ వచ్చింది.  ఇదీ అంత నచ్చలా.

ఒకానొక దశ లో వెళ్లి పోదాం అనిపించింది.  అంతా బోర్ గా ఫీల్ అయ్యాం. కాని మమ్మల్ని ఉండేలా చేసింది ఒకే ఒక కారణం. అదే ఎఫ్ 16 /ఎఫ్ 18  విన్యాసాలు.  అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, ఒకే సారి పైనుండి, ఆకాశం బద్దలయేలా,  గుండెలు దడ దడ లాడేలా,  విపరీతమయిన వేగం తో పల్టీ కొడుతూ, గిర గిరా తిరుగుతూ,  నింగికి కన్నం పెడుతున్నాయా అన్నట్లు ఎగురుతూ, ఎగిరాయి.  ఎందుకో వాటిని చూస్తూ ఉన్నంత సేపు రోమాలు నిక్కపోడుచుకున్నాయి.  భలే గా అనిపించింది.

అప్పుడు అనిపించింది. పోయేలోగా ఒక్కసారి అయినా ఫైటర్ జెట్ ను నడపాలి. అదీ MIG లు, మామూలు విమానాలు కాదు.  వీలు అయితే F16 లు, లేక పొతే Sukhoi లు. మనకి అంత సీన్ లేదు కాని, ఒక దారి ఉంది.  ఉక్రెయిన్ లోనో, లేక ఇంకేదో సోవియట్ కంట్రీ లోనో  గంటకు ఇంత అని చెప్పి ఇచ్చి,  నడపొచ్చు. 

ముందు డబ్బులు సంపాదించాలి.
మొత్తం మీద ఇది మరీ అంత కాదు కాని, కొంత బావుంది.  సూపర్ పవర్ రేంజ్ లో

మాత్రం లేదు.  ఈ విన్యాసాలు చేయడానికి యెంత కష్టం పడతారో నాకు తెలియదు.  ప్రాణాలతో ఆట కదా.  కాబట్టి కనిపించేది చూడటం తప్ప, కామెంట్లు చేయడం తప్పేమో. 

ఇన్ని ఫోటో లు తీసినా, ఫైటర్ జెట్ లవి మాత్రం కుదరలేదు. నా కెమెరా అందుకు సరిపోదు.  ఇంకొక విషయం ఏమిటి అంటే ఒకోసారి నాలుగైదు విమానాలు ఒక టీం గా చేస్తుంటాయి. బహుశా దీనికి బోలెడంత ప్రాక్టీస్,   మంచి అండర్ స్టాండింగ్ కావాలి.

గాలిలో ఎగిరే విమానాలు బాలేకపోయినా, నీటి లో స్నానం చేస్తున్న సీతాకోక చిలుకలు బావున్నాయి కదా.  కాబట్టి, నో మోర్ కంప్లైంట్స్ . . .  అదీ సంగతి.

























Continue Reading →

Monday, August 9, 2010

శరత్ గారిని కలవబోతున్నానోచ్ ...

ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగానే చదువుతున్నాను.  అలానే శరత్ గారి కాలమ్ కూడా  ... అపుడెపుడో ఏదో రాస్తే నేను కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నాను. కలవాలి అనుకుంటే మెయిల్ చేయి అని చెప్పి id  ఇచ్చారు.  కాని ఎందుకో మెయిల్ చేయలేకపోయాను.  మరి కొన్ని రోజులలో వెనక్కు వచ్చేస్తున్నాను కదా,  కలుద్దాం అనిపించింది.  ఈ మధ్యాహ్నమే మెయిల్ చేసాను.  రిప్లై వచ్చింది - ఫోన్ నెంబర్ తో సహా.  కాల్ చేసాను.  విషయం ఏమిటి అంటే నేను నేను అని ఆయనకు తెలియదు.  బేసిక్ గా నేను ఎక్కువ ఏమి రాయను కదా. 

ఫోన్ చేస్తున్నపుడు కొంచం ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను.  ఎందుకంటే మనకు అంతగా పరిచయం లేని , ఇప్పటి వరకూ చూడని   నేను అంటే తెలియని వ్యక్తితో మాట్లాడుతుంటే ఇలానే ఉంటుందేమో.  ఈ మధ్యనే ఆయన తన బ్లాగ్ లో ఫోటో పెట్టారు.  నేను చూసి ఉండకపోతే బావుండేది.  రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది.  ఫోన్ ఎత్తారు - "హలో, శరత్ గారా అన్నాను. ".  అవును అని చెప్పి, మీరు "... ఆ"  అన్నారు.  "అరె, బానే చెప్పేసారు" అనుకున్నాను.  ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కొత్త నెంబర్ వస్తే బహుశా నా నుండే అనుకుని ఉండవచ్చు.  మాటలలో తెలిసింది - మేము ఉండేది ఒకే ప్లేస్ లో అని,  ఒక మూడు మైళ్ళ దూరం లో.  భలేగా అనిపించింది.  అరె నిన్ననే మెయిల్ చేసి ఉంటే, ఈ రోజు కలసి ఉండే వాడిని అనుకున్నాను.  ఎక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారు,  అవీ ఇవీ మాట్లాడుకున్నాం.  

మొత్తానికి  వచ్చే శనివారం కలవబోతున్నాను.  ఆయనకు కాఫీ తాగే అలవాటు ఉంటే స్టార్ బక్స్ కు వెళ్ళాలి.  అదీ సంగతి.  ముందే చెప్పేసాను - నాకు ఈ సాహిత్యం,  పుస్తకాలూ  చదవడం అంతగా అలవాటు లేదు,  మీరు నన్ను కలసిన తరువాత టైం వేస్ట్ గాడు అనుకోకూడదు అని.  సో, నో ప్రాబ్లెమ్స్.    
Continue Reading →

Saturday, August 7, 2010

లాప్ టాప్ కొన్నానోచ్ ...

-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్కువ కదా.  ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు కొనే ఆలోచన ఏమి లేదు.  కాని అక్కడకు వెళ్తే అవసరం అయితే ఏమి చేయాలి.  సరే కొందాం అని అనుకున్నాను. కాని ఏమి కొనాలి. ముందు నుండి నాకు హెచ్. పీ. అంటే ఇష్టం.  కాని తీరా కొనేటప్పటికి నిర్ణయం మారిపోయింది.  డెల్ తీసుకుందామని అనుకున్నాను.  ఎక్స్. పీ. ఎస్ ౧౬ కొనాలనుకునాను. కాని అది పద్నాలుగు వందలు అవుతుంది.  i7  ప్రాసెసర్ .  ఆలోచించి, ఆలోచించి  vostro 3400 ఆర్డర్ చేసాను. అది i5 ప్రాసెసర్, 320 GB హార్డ్ డిస్క్,  4  gb  RAM .  బేసిక్ గా మన అవసరం ఏంటి అని ఆలోచించాను. గేమ్స్ ఆడడానికి కాదు,  సినిమా లు చూడడానికి కాదు.  జాబు మానేస్తున్నాం కదా,  ఏదయినా నేర్చుకోడానికి కంప్యూటర్ అవసరం. కొంచం Linux , కొంచం programming  చేయడానికి. దానికి  ఈ కాన్ఫిగరేషన్ సరిపోతుంది.

డెస్క్ టాప్ కన్నా, లాప్ టాప్ అయితే బెటర్. ఇవాళే ఇంటికి వచ్చింది.  మొత్తం ఎనిమిది వందల యాబై డాలర్లు అయింది.

కొనే ముందు దీని గురించి రకరకాల రివ్యూ లు చదివాను.  అంతా బానే ఉంది అన్నారు.  i5  స్పీడ్ మనకు సరిపోతుంది. కాని అనిపించింది. నెట్ లో చూసిన మోడల్ లాగ లేదు. కొంచం తేడా గ అనిపించింది.  ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది 14 ""  స్క్రీన్. అంటే కొంచం చిన్నగా ఉంటుంది.  కాని నాకు నచ్చింది.  డెల్ కస్టమర్ సర్వీసు చాలా బావుంటుంది అట.  ఆర్డర్ చేసిన మూడవ రోజునే ఇంటికి వచ్చేసింది.   ఆఫీసు లో ఏ పనీ చేయబుద్ది కాలేదు. ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అన్న ఆలోచనలే.  ఎందుకంటే ఈ


మోడల్ ఇప్పటి వరకూ చూడలేదు.  grey కలర్.  6 సెల్ బాటరీ. చూడాలి ఒక సంవత్సరం పొతే ఎలా పని చేస్తుందో. అప్పటి వరకూ ఉంటుందో లేదో.  

ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు - ఇంకొంచం డబ్బులు పెడితే  ఆపిల్  ఐ-మాక్ వస్తుంది అని. కాని నాకు ఎందుకో అది నచ్చదు. నన్ను మూర్ఖుడు అన్నారు. అవును అని చెప్పాను. 
Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts