Thursday, October 28, 2010

మాచవరం కొదమ సింహం

పూణే నుండి హైదరాబాద్ వస్తున్నపుడు  బస్సు లో 'ఆవకాయ్ బిర్యాని' మూవీ వేసాడు. పూర్తిగా చూడలేదు గాని బాలేదు అనిపించింది.  ఇలా బస్సు లో వస్తున్నపుడు మంచి సినిమాలు వెయ్యకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. అదేంటో నాకు డబ్బులు పెట్టి  హాలులో చూసిన సినిమా కన్నా,  ఇంటికి వెళ్తున్నపుడు  బస్సు లో వేసిన సినిమా చూస్తుంటే భలే గా ఉంటుంది.  అది అప్పటివరకూ నేను చూడని సినిమా అయి ఉండి,  మంచి సినిమా అయితే మరీను... 

చిన్నప్పుడు  వినాయక చవితికి, దసరాకు,  సంక్రాంతికి  చాలా బాగుండేది.  రోడ్డు మీద తెర కట్టి,  ప్రొజెక్టర్ తో  మంచి, మంచి సినిమా లు వేసేవారు మా ఊరిలో.  రాత్రి  ఎనిమిది అయ్యేటప్పటికి  మాంచి సందడిగా ఉండేది.  గోనె సంచులు పట్టుకుని  పరుగెత్తేవాళ్ళం.  తెర కు రెండు వైపులా జనమే.  ఏమేమి చూసానో గుర్తు లేదు కాని,  'రాజ కోట  రహస్యం', 'వేటగాడు' చూసినట్లు గుర్తు.  మళ్లీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అనిపిస్తుంది.








మా ఊరిలో సినిమా హాలు లేదు.  ప్రక్కనే ఉన్న రామచంద్రపురం గాని,  మాచవరం గాని వెళ్ళాలి.  అపుడు చూసిన సినిమా నే 'కొదమ సింహం'. మా ఊరి నుండి  మాచవరం ఒక నాలుగు కిలోమీటర్ లు ఉంటుందేమో.  కాలువ గట్టు మీద నుండి అలా నడుచుకుంటూ  మా చిన్నాన్న,  నేను, మా కజిన్స్  అందరం కలసి ఉదయం పన్నెండు కల్లా  హాలు దగ్గరకు చేరుకున్నాం.  అప్పుడు చావు కబురు చల్లగా తెలిసింది.  మార్నింగ్ షో  లేదు అని.   మళ్లీ ఆ గట్టు వెంబడే  ఇంటికి వచ్చి  అన్నం తిని మళ్లీ  బయలుదేరాం.  ఇసుక లో  కుర్చీలు వేసి కూర్చోబెట్టారు.  అయితేనేం,  సినిమా బావుంది.

Continue Reading →

Saturday, October 23, 2010

ఓ, సచిన్ ఇక్కడకు వెళ్లేవాడా !!

ఇంతకు ముందు పేపర్లో చాలా సార్లు చదివాను. సచిన్  ఫ్యామిలీ తో కలసి లోనావ్లా వెళ్ళాడు అని.  అది పూణే కు దగ్గర అని తెలుసు కాని, మరీ ఇంత దగ్గర అని తెలియదు, అంటే జస్ట్  నలబై కిలోమీటర్ లు మాత్రమే.  ఆఫీస్ పని మీద రెండు వారాలు పూణే లో ఉండాల్సి వచ్చింది.  అప్పుడు వెళ్ళాను ఇక్కడకు.  చాలా మంది చెప్పారు చాలా బావుంటుంది అని. వెళ్ళిన తరువాతే తెలిసింది ఇంత బావుంటుంది అని.

బైక్ మీద వెళ్ళాం.  అప్పుడు తీసాను ఈ ఫోటోలు.

















ఈ ప్లేసు ను  "Lion 's  point " అంటారట.  ఇక్కడ నుండి చూస్తే అల్లంత దూరాన అంతా  ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది.  ఇక్కడకు రావడానికి మంచి టైం జూలై, ఆగస్ట్ అట. ఎందుకంటే  వర్షం లో  అద్బుతం గా ఉంటుందట.  కళ్ళు మూసుకుని ఒక్క  క్షణం  ఊహించుకున్నాను -  ఆకాశం నుండి అంత నీరు ఆ లోయలలోకి కురుస్తుంటే .... వచ్చే సంవత్సరం వెళ్ళాలి ....















Continue Reading →

మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???

అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు - ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక ఐదుగురు టీం ఉండేది. నేను గమనించింది ఏమిటి అంటే చాలామంది పొట్టిగా, లావుగా, ఉంటారు అని. ఈ ఐదుగురు లో నలుగురు కూడా సేమ్ బాచ్ కు చెందిన వారు. కాని మిగిలిన ఒక అమ్మాయి మాత్రం కాదు. తనను అక్కడకు వెళ్ళిన మూడు నెలల తరువాత చూసాను. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే అటువైపు వెళుతుంటే ... చూసింది. 'హాయ్' అన్నాను. తిరిగి హాయ్ చెప్పింది. అప్పుడు అబ్సర్వ్ చేసాను. తను మిగతా వాళ్ళ లా కాదు. పొడుగ్గా, మరీ లావు, సన్నం కాకుండా, యెర్ర గా ఉంది. ఎరుపు అంటే ఎరుపు కాదు ... యాపిల్ కలర్. అయ్యా బాబోయ్, ఇంత అందం గా ఉందేంటిరా అనుకున్నాను. ఇక అప్పటి నుండి, తనను బాగా చూడడం మొదలెట్టాను.

ఒక రోజు మళ్లీ కనిపించింది. ఈ సారి, నీ పేరేంటి అని అడిగా. "లుపీత" అని చెప్పింది. అర్థం కాలేదు. 'సారీ' అన్నాను. మళ్లీ చెప్పింది. 'లుపీతా' అని. అర్థం కాలే. ఆఫీసు కు వెళ్ళిన వెంటనే గూగుల్ ఓపెన్ చేసి, మీనింగ్ వెతికాను. పూర్తిగా అర్థం కాలేదు కాని, మదర్ మేరి కు సంబంధించినది అని తెలిసింది. ఓకే, ఈ సారి తను కనిపిస్తే, తనను ఆశ్చర్య పరిచేలా, స్పానిష్ లో పలకరిద్దాం అని చెప్పి, స్పానిష్ చెప్పే సైట్స్ ఓపెన్ చేసి రోజు డైలీ వాడే వాక్యాలు ఏమిటా అని వెతకడం మొదలెట్టాను. తను కొన్ని రోజులు కనిపించలేదు కాని నా ఈ ఎక్సర్సైజ్ మాత్రం కొన్ని రోజులు సాగింది. రోజు నేను ఉదయం ఎనిమిది కే వెళ్లి, సాయంత్రం వచ్చే వాళ్ళం. తను ఎనిమిది తరువాత వచ్చి, మధ్యాహ్నం వెళ్ళిపోయేది. శని వారాలు పని ఏమి లేకపోయినా హోటల్ లో అటు, ఇటు తిరుగుతూ ఉండేవాడిని, తను కనిపిస్తుందేమోనని.

అటువంటి ఎదురుచూపుల కాలం లో, ఒక రోజు ... అయ్యో ... ఒకరోజు జరిగిందా సంఘటన. బయట నుండి వస్తుంటే ... రిసెప్షన్ లో ఎవరో మెరుస్తూ కనిపించారు. ఎవరీ మెరుపు తీగ అని చూస్తే, తనే. బ్లాక్ కలర్ టీ షార్ట్ వేసుకుని, జీన్స్ వేసుకుని, మతి పోయేలా ఉంది. కలర్ ఉన్నవాళ్ళు, బ్లాక్ కలర్ లో అందంగా కనపడతారు అనుకుంటాను. పైకి వెళ్ళి వచ్చేటప్పటికి కనిపించలేదు. అడిగితే ఏదో రూం లో ఉంది అని తెలిసింది. వెళ్ళాను. అప్పుడు గాని నేను ఆలోచించలేదు. నేను ఎందుకు ఇలా తిరుగుతున్నాను. వెళ్ళి ఏమి చేస్తాను. ఏమో నాకే తెలియదు !! వెళ్ళాను. ద్వారం తెరచియే ఉన్నది. చేతులు కట్టుకుని, డోర్ మీద వాలి ఒక పోజ్ ఇస్తూ, తనను చూస్తూ నిల్చున్నాను. తను కొంతసేపటికి గాని నన్ను గమనించలేదు. "ఏమి కావాలి" అని అడిగింది. నాకు అప్పటివరకూ చదివిన స్పానిష్ పదాలు, వాక్యాలు గుర్తుకు రాలేదు. ఏమి మాట్లాడాలో తెలియలేదు. "ఏమి లేదు, నీతో కొంచం మాట్లాడాలి" అన్నాను. "ఏమిటి" అంది. "నీకు పెళ్లి అయిందా" అని అడిగాను. కాని ఈ ప్రశ్న ఎందుకు అడిగానో నాకే తెలియదు. ఒక వేళ, అవ్వకపోతే ఏం చేసే వాడినో నాకు తెలియదు. "అయింది" అని చెప్పింది. అరరే, అనుకుని, బై చెప్పి వచ్చేసాను.

తప్పో, ఒప్పో నాకు తెలియదు కాని ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని, ముద్దు పెట్టేసుకోవాలి అనిపించేది. అప్పటి నుండి అప్పుడపుడూ కనిపించేది కాని, అలా చూస్తూ ఉండిపోయే వాడిని, పలకరించడం మానేసి ...
Continue Reading →

భూపతి పాలెం కథలు ...

ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.  అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను.  వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని.  అవి ఇలా ఉన్నాయి ...

అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత - రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం లో నేతాజీ సుబాష్ చంద్ర బోస్ కు పర్సనల్ డాక్టర్ గా ఉన్నారు. తరువాత, రాజమండ్రి వచ్చి ఇక్కడ వారికి ఏమి అన్నా చేద్దాం అని స్కూల్ పెట్టారు. ప్రభుత్వం దానిని గురుకుల స్కూల్ గా చేసింది. ఆంధ్ర పదేశ్ కో ఉన్న గురుకుల స్కూళ్ళు అన్నిటిలో ఇది టాప్. అటువంటి చోట చదవడం నా అదృష్టం గా ఫీల్ అవుతుంటాను అపుడపుడు.

భూపతిపాలెం రాజమండ్రి దగ్గర ఉన్న ఏజెన్సీ లో ఉంటుంది. స్కూల్ చుట్టూ దట్టమయిన అడవులు. కొంచం దూరం గా పిల్లలు, టీచర్లు, వంట వాడు, బార్బర్ వీళ్ళందరూ ఉండడానికి హాస్టల్. విశాలమయిన, ఒక చివర నుండి చూస్తే రెండవ చివర కనిపించనంత పెద్ద ప్లే గ్రౌండ్. అపుడపుడూ పిల్లలను పలకరించడానికి వచ్చే ఎలుగు బంట్లు, పాములు, ఇతర అడవి జంతువులూ. ఇదీ స్కూల్ పరిచయం.  ప్రకృతి ఒడి లో నేర్చుకున్న పాఠాలు, ఆడిన ఆటలు, ఆ పరిసరాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఒక రావి చెట్టు ఉండేది. ప్రతీ వారం తెలుగు పీరియడ్ లో క్లాసు అందరం దాని దగ్గర చేరేవాళ్ళం. ఎవరో ఒక కవినో, రచయిత నో తీసుకుని వాళ్ళ గురించి, వాళ్ళ వర్క్ గురించి చెప్పాలి. కవితలు అల్లాలి.

మా పీ.డి. ఉండేవాడు. మహా చండశాసనుడు. ఆయన ఇంటి ముందు ఒక సైజు లో కొబ్బరి చెట్టు ఉండేది. మరీ అంత ఎత్తు కాదు గాని, ఒక మోస్తరుగా, నిండు కాయలతో బరువుగా ఉండేది. మా క్లాసు లో ఉన్న ముగ్గురు ఆకతాయి ల కళ్ళు వాటి మీద పడ్డాయి. ఒక రోజు అర్ద రాత్రి ముహూర్తం పెట్టారు. చుట్టూ చీకటి. లైట్ లు లేవు. అడవి జంతువుల ఆరుపులు. ముగ్గురూ చెట్టు దగ్గరకు చేరారు. మాంచి దిట్టం గా ఉన్నోడు చెట్టెక్కాడు. ఇంకొంచం పైకి ... అందడం లేదు. చివరి కంటా ఎక్కేసాడు. సరిగా కాయలు దించే వేళ వాడి బరువుకి చెట్టు తల బాగం విరిగి పోయింది. వాడు పడిపోయాడు. అదృష్టం, శబ్దం వచ్చినా ఇంట్లో అలికిడి లేదు. ముగ్గురికీ ఉచ్చ్చ కారిపోయింది. ఇప్పుడెలా ? అసలే మాస్టారు మహా క్రూరుడు. ఈ పని ఎవరూ చేసారో అని పసి గట్టేస్తాడు. ఇంతకు ముందే అతడి బండి పెట్రోలు తనకు లో పంచదార పోసినందుకు ఆల్రెడీ చేతులు విరగ్గోట్టించుకుని ఉన్నవాళ్ళు. ముగ్గురిలో ఒకడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. స్కూల్ గ్రౌండ్ దగ్గర అలాంటి సైజు ఉన్న కొబ్బరి చెట్టు ఉంది. దానిని తీసుకు వచ్చి పాతేస్తే ???

పిచ్చోడిని చూసినట్లు చూసారు మిగతా ఇద్దరు. ఇది సాధ్యం అయ్యేనా ? కొబ్బరి చెట్టు వ్రేళ్ళు భూమి లోపల బాగా లోతుకు వెళ్లి పోయి ఉంటాయి . ఇక్కడ దీనిని తవ్వి, అక్కడ దానిని తవ్వి, అక్కడ నుండి తీసుకు వచ్చి ఇక్కడ పాతడం అయ్యే పనేనా ? ఒక వేళ పాతినా అది బ్రతుకుతుందని నమ్మకం లేదు. కాని వేరే దారి లేదు. హాస్టల్ కు వెళ్లి మరో ఇద్దరినీ లేపి, ఆ అర్ద రాత్రి కొత్త చెట్టుని పాతేసారు. ఈసురో మంటూ హాస్టల్ కు వచ్చి తెల్లవారు జామున పడుకుండి పోయారు.  ఆశ్చర్యం !! మరుసటి రోజున మాస్టారుకి అనుమానం ఏమి రాలేదు. బ్రతకదు అనుకున్న ఆ కొబ్బరి చెట్టు కొన్ని రోజులకి విరగ కాయడం మొదలెట్టింది.

చెట్టుకి ముగ్గిన పనస పండు వెదజల్లే సువాసన అంతా, ఇంతా కాదు. మా స్కూల్ చుట్టూ ఉన్న అడవిలో చాలా పనస చెట్లు ఉండేవి. ఏ చెట్టు కాయలు పండుతాయి, ఎప్పుడు తినొచ్చు అన్నది చూసేందుకు సర్వే చేస్తూ ఉండేవాళ్ళం. మా స్కూల్లో చాలా గ్రూపులు ఉండేవి, అలానే మా క్లాసు లో కూడా. బండి పోటు దొంగల్లా ఒక గ్రూపు ఆస్తులు వేరే గ్రూపు లు దొంగతనం చేస్తూ ఉండేవి. మా పనస పళ్ళు వేరే గ్యాంగ్ కంట పడకుండా చేయడం మహా కష్టం. దాని కోసం, పండు పాడవకుండా కాగితం చుట్టి, గొయ్యి తీసి, ఎవరికీ అనుమానం రాకుండా పైన ఆకులు, మట్టి వేసి దాచేవాళ్ళం. ఇంత చేసినా ఎవడో ఒకడు పసిగట్టేసేవాడు.  అలానే జీడి పిక్కల ఏరివేత కార్యక్రమం. ఎలుగు బంట్ల కు జీడి పళ్ళు అంటే మహా ఇష్టం. పండుని పండు లానే మింగేస్తాయి, క్రిందనున్న పిక్కతో సహా. కాని అది అరగదు. ఎలుగు బంటి తిన్న తరువాత వాటర్ ఎక్కడుందో అక్కడకు వెళ్తుంది. అలానే మాకు తెలుసు మేమెక్కడికి వెళ్ళాలో. చుట్టూ పక్కల నీరు ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు కాబట్టి, అన్నీ వెతికేవాళ్ళం. దాని పేడ దొరకగానే మాకు పండగే, పండగ. పేడను వెతికి జీడి పిక్కలు సంపాదించేవాళ్ళం.

ఇలాంటివి ఎన్నెన్నో ...
Continue Reading →

Thursday, October 7, 2010

బోలో ... గణేష్ మహారాజ్ కీ జై ...

అపుడపుడు అనిపిస్తుంది ఏ పండగకు లేని శక్తి వినాయక చవితి కి ఉంది అనిపిస్తుంది. ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నా, నిమజ్జనం రోజు మాత్రం చాలా బావుంటుంది.  అసలు ఆ డప్పులు, ఆ డాన్సులు చూస్తుంటే సూపర్ గా ఉంటుంది.

నాకు ఎప్పటి నుండో ఒక కోరిక మిగిలిపోయింది - వాళ్ళు కొట్టినట్లు డప్పు కొట్టాలి,  డాన్సు వెయ్యాలి.  మొన్న చాన్స్ వచ్చింది కాని సిగ్గేసింది. ఎవరో చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఏమి చేయలేం. ఒకటి వీడియో తీశాను.  అపుడు మిత్రురాలు అడిగింది. "నువ్వు ఏ పని అయినా చేసేముందు బ్లాగు లో పెట్టాలి అన్న ఆలోచన తోనే చేస్తావా ? "  అని.  అపుడు అనిపించింది - నిజమేనా అని.  ఏమో ???


మా బావ వాళ్ళ అపార్ట్ మెంట్ లో కూడా వినాయకుడిని నిలబెట్టారు. నిమజ్జనం రోజు భోజనాలు. ఆ హారతులు, దిష్టి తీయడాలు, కొబ్బరి కాయలు కొట్టడాలు అంతా చాలా శ్రద్దగా చేసారు. దేవుడు మంచి గానే ఫీల్ అయి ఉంటాడు.


 
 
 
Continue Reading →

Tuesday, October 5, 2010

నా FZ16 ...

మొన్ననే బైక్ కొన్నాను.  ఇప్పటి వరకూ ఆటోలు, బస్సుల మీదనే గడిపేసాను.  మా బావ చెప్పాడు - నీకు వాహన యోగం ఉంది అని చెప్పి.  వాహనం యెంత విలువయినదో కూడా చెప్పాడు. శివుడికి నంది, వినాయకుడికి మూషికం ఇలా ప్రతి దేవుడుకి వాహనం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.  నీ హెల్త్ యెంత విలువయినదో,  బండి హెల్త్ కూడా అంతే విలువ అని ఇంకా ఏవేవో చెప్పాడు. 

నాకు పల్సర్ అంటే చాలా  ఇష్టం. కాని ఈ మధ్య వస్తున్న మోడల్స్ నచ్చడం లేదు. ఇంకా కరిజ్మా, సి.బి.జి, యునికార్న్ ఏది బావుంటుందో అని ఆలోచించాను. రివ్యూ లు చదివాను.  కాని యమహ FZ16 మీదకు మనసు లాగేసింది. చూడడానికి గేదె లా ఉన్నా, మైలేజ్ ముప్పై అయిదు, నలబై ఇచ్చినా  బానే ఉంది అనిపించింది.  వెంటనే కొనేసాను.

ఇప్పుడు బానే ఎంజాయ్ చేస్తున్నాను.

ముందయితే ఫేజర్ అనుకున్నాను. కాని తెలిసింది FZ16 , ఫేజర్, FZ -S  ఇవి అన్నీ బేసిక్ గా ఒకే మోడల్. చిన్న, చిన్న తేడాలు తప్ప అని.  ఎందుకో ఈ మధ్య రెడ్ కలర్ మీదకు మనసు లాగేస్తుంది. ఆంజనేయ స్వామి గుడి లో పూజ చేయించాను. అదేంటో అదో ఫీలింగ్. పూజ చేయించేసాం,  ఇంక మనకు ఏమీ కాదు అనిపిస్తుంది.

Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts