Thursday, May 6, 2010

రంగుల ప్రపంచం ...

డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుండి కారు ఎప్పుడు నడుపుతామా, అంతా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు అంత అందంగా, సొగసుగా ఉంటాయి మరి ... ఇక్కడకు వచ్చిన కొత్తలో రూం కే అతుక్కుని ఉండేవాడని ... ఇప్పుడు శనివారం వస్తే చాలు ఎక్కడకు వెళ్తామా అనిపిస్తుంది. జయ తీర్థ్ గారిని అడిగాను - ఈ వారం ఎక్కడకు వెళ్తున్నాం అని. ఆయన చెప్పాడు - రమేష్ ఫ్యామిలీ, నేను, హరి కలసి హాలాండ్ వెళ్తున్నాం అని. అక్కడ ట్యులిప్ పూల తోటలు ఉంటాయట. నేను వస్తాను అని చెప్పాను. లేదు నాయనా, కారు సరిపోదు అని చెప్పారు. అరరే అనిపించింది. కాని రాత్రి ప్రొడక్షన్ ఇష్యూ ఉండడం తో ఐదు వరకు పడుకోలేదు. ఒక గంట పడుకున్నానో లేదో, కాల్ వచ్చింది - రెడీ అవ్వు, మనం వెళ్తున్నాం అని. నిద్ర లేకపోయినా బయలుదేరాను.


అక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుంది. మధ్యలో ఒకచోట ఆగి పులిహోర తిని, పప్పు తో చపాతీ తిని, స్టార్ బాక్స్ లో కాఫీ తాగి,
వెళ్తుంటే అదో అనందం. ఇండియానా దాటి, మిచిగాన్ లో కి వెళ్ళాలి. ఒక రెండు వందల యాభై మైళ్ళ ప్రయాణం. బావుంది. మధ్యాహ్నంకి అక్కడకు చేరుకున్నాం

















Continue Reading →

Tuesday, May 4, 2010

ఎప్పుడూ అనుకోలేదు ...

కారు నేర్చుకోవడం మొదలెట్టి ఏప్రిల్ ఇరవై ఒకటికి నెల రోజులు అవుతుంది. అప్పటికి పన్నెండు క్లాసులు తీసుకున్నాను. ముందు రోజే బావ చెప్పాడు - చందమామ కర్కాటకం లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకుని నడిపినా నీకు లైసెన్సు వస్తుంది అని. ఈ మాట చాలు - ఎక్కడ లేని కాన్ఫిడెన్సు వచ్చేసింది. అంటే డ్రైవింగ్ కష్టం అని కాదు. ఫస్ట్ టైం కదా కొంచం భయం గా ఉంటుంది. తీరా టెస్ట్ లో సరిగా నడపలేదు. దొబ్బేసింది. అరే ఇలా అయిందేమిటి అని అనుకున్నాను. తరువాత తెలిసింది - అయిదు సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని. అంతే, మళ్ళా మామూలే.

నాకు తెలిసింది - మనం చేసే ప్రాక్టీసు సరిపోదు అని. కారు రెంట్ కు తీసుకుని ప్రాక్టీసు చేద్దామంటే కొంచం కష్టం. ఎందుకంటే, మన ప్రక్కన అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు కూర్చోవాలి. జయతీర్థ్ గారు సరే, నేను ఉన్నాను కదా అన్నారు. అంతే, నిస్సాన్ సెంట్రా రెండు రోజులు తీసుకున్నాను. నా ఆలోచన ఒక్కటే. ఈ రెండు రోజులలో కనీసం మూడు వందల మైళ్ళు నడపాలి. మొత్తం మీద అక్కడకు, ఇక్కడకు, ఎక్కడకో నడిపెసాను. ఈ సారి మళ్లీ కాన్ఫిడెన్సు వచ్చేసింది.

రెనట చెప్పింది - ఏప్రిల్ ముప్పైన మళ్లీ టెస్ట్ కు వెళ్దామని. సరే, ఉదయం ఎనిమిది కల్లా డి.ఎం.వి ఆఫీసు కి వెళ్ళాం. మొదలయింది - ఎక్జామినర్ కు ఒక ఎనబై ఏళ్ళు ఉంటాయేమో. అలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పింది. ఫైనల్ గా, నువ్వు బాగా డ్రైవ్ చేసావు అని చెప్పింది. అంటే, అమెరికా లైసెన్స్ వచ్చేసింది. తనతో స్టార్ బక్స్ కు వెళ్దాం అనిపించింది. కారుకు ఫోటో తీయాలి అనిపించిది. కాని, లేట్ కావడం తో "డ్రైవ్ సేఫ్ లీ " అని చెప్పి వెళ్ళిపోయింది ...

అదీ మన లైసెన్స్ కదా ... ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడనవసరం లేదు ... ఎక్కడికయినా వెళ్లిపోవచ్చు ... నా లైసెన్స్ నే చూస్తూ కూర్చున్నాను. ఆఫీసు లో పని చేయబుద్ది కాలేదు ... చేయలేదు ...

రమేష్ గారి ఫ్యామిలీని, జయతీర్థ్ గారిని, సునీల్ గారిని తీసుకెళ్ళి నపుడు తీసిన ఫోటో లు -






/









Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts