Sunday, June 27, 2010

చలో లేక్ జెనీవా ...

నేను ఉండే ప్లేస్ కు ఒక నలభై మైళ్ళ దూరం లో లేక్ జెనీవా అని ఉంది. ఇంతకు ముందు లేక్ లు అంటే చిన్న, చిన్నవి అనుకునేవాడిని. కాని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది అవి యెంత పెద్దగా ఉంటాయో. ఇవాళ శనివారం కదా. ముందు డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం. కాని మా చెత్త గాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రాం చెడగొట్టారు. రూం లో ఉండిఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి సరదాగా అలా బయటకు వెళ్ళడానికి ఒప్పించాను. ముందు లేక్ జెనీవా కు వెళ్దాము అని అనుకోలేదు గాని, అలా అలా వెళ్ళిపోయాం - పాటలు వింటూ, మాట్లాడుకుంటూ.

మా వాళ్ళు ముందు అంత ఇంటరెస్ట్ చూపెట్టలేదు కాని, అక్కడకు వెళ్ళిన తరువాత తమ కెమెరాలకు పని చెప్పారు. విషయం ఏమిటి అంటే వేసవి కదా. అందరూ బికినీలు వేసుకుని స్నానాలు చేసేస్తూ ఉంటారు. వాళ్లకు అది అంత పెద్ద విషయం కాకపోవచ్చు కాని మన కళ్ళకు పండగే. ఇది తప్పో, ఒప్పో నాకు తెలియదు కాని వాళ్ళ అందాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇక్కడకు వచ్చే ముందు బావ చెప్పాడు - ఇక్కడ చాలామంది అమ్మాయిలు శిల్పం చెక్కినంత అందం గా ఉంటారు అని. అది నిజమే అనిపిస్తుంది. కళ్ళు అప్పగించి వాళ్ళనే చూస్తూ ఉంటాము. ఎవరూ మనల్ని చూడకుండా వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉంటాము - తప్పు అని తెలిసినా. అందరూ ఇలా ఉండరు.

ఇదీ నా అభిప్రాయం. తప్పు అయితే కావచ్చు. నేను చెప్పినది కొంత మందికి నచ్చకపోవచ్చు. కాని అది ఓకే.

లేక్ జెనీవా కొన్ని ఫోటోలు :





నాకు తెలుసు ఫోటో లు ఇంకా బాగా తీయొచ్చు అని. కానీ ఎందుకో కుదరలేదు. ఏదో ఒకటి రాయాలి అనిపించి ఇవి అప్ లోడ్ చేసాను. మిగిలిన ఫోటోలను సెన్సార్ చేసాను. కొన్ని జ్ఞాపకాలు ... అంతే ...

Continue Reading →

Thursday, June 24, 2010

పడమటి సంధ్యా రాగం ...

ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను. వేసవి కాలం కదా, తొమ్మిదవుతున్నా ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు ఈ రోజుకిక బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచం చాలా అందం గా ఉంది. మనసు బావుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇవాళ భలే ఉంది. ఉదయం నుండి వర్షం పడి ఆకాశం ఒక ప్రక్క మబ్బుగా ఉంది, మరో ప్రక్క ఎండగా ఉంది.




Continue Reading →

Sunday, June 20, 2010

అందాల చికాగో ...

మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి పది నెలలు అయినా చికాగో డౌన్ టౌన్ ఇప్పటివరకూ చూడలేదు. చాలా బావుంటుంది అంట - చివరికి నిన్న కుదిరింది.

కారుని రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, మెట్రా ట్రైన్ లో బయలుదేరాం. ఇక్కడ ఇప్పుడు సమ్మర్. జనాలంతా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా సరిగా బట్టలు వేసుకోకుండా తిరిగేస్తూ ఉంటారు. నిన్న టైం అంత బాలేదు. ట్రైన్ కొంచం లేట్. మా ఫ్రెండ్ ఒకడు తన ఆఫీసు అడ్రస్ వెతకాలి అంటే టైం అంతా దాని కోసమే సరిపోయింది. చూసింది ఏంటంటే పెద్ద, పెద్ద బిల్డింగ్స్ , మిచిగాన్ లేక్, మిలీనియం పార్క్ అంతే. చీకటి పడిపోయింది.

వెళ్తుంటే ఒక చోట కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళు ఒక చోట నిలిచిపోయాయి. ఆ మూమెంట్ బావుంది. కారణం ఈ ఫోటో -
అపుడెపుడో పేపర్ లో చదవడమే - అక్కడెక్కడో గాంధీ విగ్రహం పెట్టారు, ఆ వీధికి వీరి పేరు పెట్టారు అని. కాని ఇప్పుడు అమెరికా లో వివేకానందుడి పేరు చూసేసరికి భలేగా అనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది - ౧౯౩౦ లలో ఆయన ఇక్కడకు వచ్చిన సంగతి.










అలా ముందుకు వెళుతూ మిలీనియం పార్క్ కు వెళ్ళాం. ఇది ఒక పెద్ద పార్క్ లా ఉంది. ఒక ప్రక్క సింఫనీ జరుగుతూ ఉంది. జనాలంతా కూర్చున్నారు.

అక్కడ తీసిన కొన్ని ఫోటో లు :















ప్రక్కనే లేక్ మిచిగాన్.









బేసిక్ గా ఇంత పెద్ద మేడలు, ఇంత అందమయిన లేక్ లు లైఫ్ లో ఇంత వరకూ చూడలేదు కదా ... అందుకే బావుంది ... నిజం చెప్పాలి అంటే ఏమి చూడలేదు అనే చెప్పాలి. కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి.

Continue Reading →

Saturday, June 19, 2010

నచ్చింది ...

నిన్ననే ఇప్పటి వరకూ ఉంటున్న హోటల్ ఖాళీ చేసి వుడ్ ల్యాండ్ క్రీక్ కు వచ్చాను. రూం నంబర్ మూడు వందల పదహారు. ఇప్పటికే సజ్జన్, జీతాన్, రితబ్రత, దీపేష్ ఉంటున్నారు. డబల్ బెడ్రూం కదా. రెండు రూం ల లోను సర్దేసుకున్నారు. నాకు వేరే ఎక్కడికి వెళ్ళడానికి కుదరక ఇక్కడకు వచ్చేసాను. వచ్చే ముందు రాకూడకు అనుకున్నాను కాని, వచ్చాక నచ్చింది. నిన్న రాత్రి వరకూ పని చేసాను. రెండున్నర, మూడు అయింది. నేను హాల్ లో కుదురుకున్నాను. ఎందుకో ఈ మూల నాకు నచేసింది.


Continue Reading →

Friday, June 18, 2010

రూం నంబర్ 229

అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత్ రూం, వండుకోడానికి స్టవ్, అన్నీ ఉన్నాయి. ఒక్క రూం లో ఇద్దరు. కాని ఇక్కడ పది నెలలు ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భలే ఆశ్యర్యం గా ఉంటుంది. రూం ని ఎప్పుడూ నీట్ గా పెట్టుకోలేదు.
ఇవాళ ఖాళీ చేసి వస్తుంటే ఏదోలా అనిపించింది. ఫోటోలు తీశాను.









Continue Reading →

Tuesday, June 8, 2010

సుబ్బలక్ష్మి ...

నిన్ననే బాణం సినిమా చూసాను. ఇది బావుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక బ్లాగులో చదివి బావుంది అనిపించి చూసాను. హీరో బావున్నాడు. తక్కువ మాటలు. నాకు హీరో కన్నా, సినమా కన్నా వేదిక కారక్టర్ చాలా నచ్చింది.

సుబ్బలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి. సినిమా లో ఈమె తక్కువ సీన్లలోనే ఉన్నప్పటికీ, ప్రతీ సీన్ చాలా బావుంది. ఇంట్రడక్షన్ సీన్ లో పచ్చడి అడగడం, భోజనం చేసేటప్పుడు గుడ్డు వెజిటేరియన్ ఫుడ్ అంటే, గుడ్డు లోంచి పిల్ల వస్తుంది, తోటకూర లోంచి రాదు కదా అనడం, ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను, బయటకు తీసుకు వెళ్లి అట్టు తినిపించొచ్చు కదా అనడం, పోలీసు ఎందుకు, కలెక్టర్ కావచ్చు కదా కోటు వేసుకోవచ్చు అనడం, ఆ మాట తీరు, అమాయకత్వం భలే ముచ్చటగా ఉంటుంది.

ఈ కాలం లో ఇటువంటి వాళ్ళు ఉంటారా ?? ఉంటే బావుంటుంది. చూసిన సీనే మళ్లీ, మళ్లీ చూస్తున్నాను. అప్పుడెపుడో బొమ్మరిల్లు లో జెనీలియా, ఇప్పుడు ఈ అమ్మాయి - బావున్నారు.

Continue Reading →

Saturday, June 5, 2010

చాలా బాగుంది ...

కారు నడపుతానని, కారు కొంటానని నాకు ఎప్పుడూ కలలూ లేవు, ఆలోచనలూ లేవు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. నాకు మాత్రం ఊహించని విషయమే. బావ హైదరాబాదు వెళ్ళిపోతున్నాడు. చివరివరకూ తన కారు తీసుకోవాలని ఆలోచన లేదు. బహుశా మే చివర్లో వెళ్ళిపోతాను అన్న ఆలోచన కావచ్చు. కాని అభిషేక్ చెప్పాడు నువ్వు ఇక్కడ ఆగస్ట్ వరకూ ఉంటావు అన్నాడు. వెంటనీ తనకు కాల్ చేసాను. నీ కారు నేను తీసుకుంటున్నాను అని. కాని ఎన్నో అలోచనలు . నయాగరా నుండి చికాగో వరకూ అంటే కనీసం ఆరు వందల యాభై మైళ్ళు దూరం. ఎప్పుడో పందోమ్మిదొందల తొభై తొమ్మిది కారు, నీకు లైసెన్స్ వచ్చి కనీసం నెల కూడా కాలేదు, హై వే మీద నువ్వొక్కడివే రావాలి, ఎవరూ ఉండరు, దారిలో కారు ఆగిపోతే ఏమి చేస్తావు, నీకు ఆక్సిడెంట్ అయితే ఏమిటి పరిస్థితి, నువ్వు రిస్క్ చేస్తున్నావు, వద్దు, వద్దు అని రకరకాలుగా బయపెట్టారు.

ఇటువంటి పరిస్థితులలో మాములుగా డ్రాప్ అయిపోతాం. కాని లేదు నువ్వు డ్రైవ్ చేయగలవు, కారు తీసుకో అని చెప్పినవాడు ఒకరు జయతీర్థ్, రెండు బావ. అదీ కాక ఒక్కడినే కారు నడుపుకుంటూ ఎక్కడికో వెళ్లిపోవాలి, అంతా తిరిగేయాలి అని ఒక కోరిక. కనీసం పదమూడు గంటల ప్రయాణం. మధ్యాహ్నం పన్నెండుకు బయలుదేరి , రాత్రి ఒంటిగంటకు వచ్చాను. ఎక్కడలేని కాన్ఫిడెన్సు వచ్చేసింది.

కారు వచ్చిన దగ్గర నుండి నాకు బాగుంది అనిపిస్తుంది. ఎవరిమీద డిపెండ్ కానవసరం లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళొచ్చు. రోజూ స్టార్ బక్స్ లో కాఫీ తాగాలి. కే.ఎఫ్.సి. లో చికెన్ తినాలి. బీచ్ కు వెళ్లి ఉదయించే సూర్యుడి ని చూడాలి. ఎప్పడు పడితే అప్పుడు ఆఫీసు నుండి రావాలి, రాత్రి పన్నెండుకు వెళ్లి కాఫీ తాగాలి . ఇవన్నీ నా కోరికలు ఇంతకు ముందు. మనకు నచ్చినవి చేస్తుంటే ఆ మజా బానే ఉంటుంది. అసలు ఆఫీసు నుండి ఎప్పుడు వెల్లిపోతామా, ఊరంతా ఎప్పుడు తిరుగుతామా అనిపిస్తుంది. బహుశా మొదటి రోజులు కదా. అందుకేమో, ఏమో ??

ఎందుకో అనిపిస్తుంది, ఈ మధ్య నేను సరిగా పని చేయడం లేదు అని. నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంట్రెస్ట్ గా చేయడం లేదు. చూడాలి. ఇప్పటివరకూ నేను చూసిన అమెరికా చాలా బావుంది.
Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts