Sunday, July 11, 2010

ఏమి చదవాలి ?

అక్కడెక్కడో చదివాను - ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం అని.  కాని మంచి పుస్తకం అంటే ఏమిటి ?  రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా.  ఆలోచించాను - ఇప్పటివరకూ పెద్దగా ఏమి చదవలేదు కాని,  చదివిన వాటిలో ఏమి ఎంజాయ్ చేసాను  అని ??  స్వాతి లో వచ్చిన సీరియల్స్,  సరసమయిన కథలు తప్పితే ఇంకేమి చదవలేదు, కాని అవి బాగానే ఎంజాయ్ చేసాను.   ఈ మధ్య అనిపిస్తూ ఉంది ... సినీమాలు,  యు ట్యూబ్,  బ్లాగులు అడిక్ట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకో నచ్చట్లా. 

అలా కాఫీ తాగుదామని బయటకు వెళ్ళాను.  ప్రక్కనే బోర్డర్స్ బుక్ షాప్ కనిపించింది.  అదేంటో నాకు బుక్స్ కొనకపోయినా,  చదవకపోయినా బుక్ షాప్ లో తిరగడం ఇష్టం.  వెళ్ళాను, రకరకాల పుస్తకాలు.  నవలలు,  ట్రావెల్ కు సంబంధించినవి,  హెల్త్,  పెర్సనాలిటీ డెవలప్ మెంట్,  చిన్న పిల్లలవి,  హిస్టరీ, టెక్నాలజీ,  సైన్సు,  వంటలు ... ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.  రొమాంటిక్ గా ఉండేవంటే నాకిష్టం.  ఆలోచించాను - కొన్నా చదువుతానా ?  ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయాను.   ఈ బుక్స్ చదవచ్చు కాని ఎందుకో చదివిన ఫీల్ రాదు.

అపుడెపుడో అల్కెమిస్ట్ చదివాను.  నచ్చింది.  సరే, అలాంటిది ఏమన్నా ఉంటుందేమోనని చూసాను. మళ్లీ ఎన్నో బుక్స్.  చివరకు 'గాడ్ నెవర్ బ్లింక్స్'  అన్న బుక్ కొన్నాను.  బేసిక్ గా ప్రతి ఒక్కరి లోను పాజిటివ్స్, నేగేటివ్స్ రెండూ ఉంటాయి కదా.  ఇందులో  నాలో ఉన్న నేగేటివ్స్ ఉన్నట్లు అనిపించింది.  మళ్లీ ఆలోచించాను - చదువుతానా లేదా అని.  ఒక డెసిషన్ కు వచ్చాను.  ఇది కనుక చదవక పొతే ఇంకెప్పుడూ బుక్స్ కొనకూడదు అని.   చూడాలి,  ఏమి జరుగుతుందో ???
Continue Reading →

ఈనాడు స్టొరీ

ఈనాడు స్టొరీ

ఇప్పుడే ఈనాడు లో కథ చదివాను. చాలా బావుంది అనిపించింది. తరువాత ఎప్పుడయినా చదవాలి అంటే కష్టం కదా. అందుకే వెంటనే పీ.డి.ఎఫ్ లో సేవ్ చేసాను. కాని అప్ లోడ్ చేయడం ఎలా ? ఎప్పుడూ  ఫోటో లు తప్ప,  డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయలేదు.  గూగుల్ లో వెతికితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాగ్స్ లో ఫోటో లు తప్ప,  ఇంకా ఏవి చేయడం కుదరదు అని తెలిసింది.  'గూగుల్ డాక్స్ లో ' లో అప్ లోడ్ చేసి, ఆ లింక్ ఇస్తున్నాను.
Continue Reading →

Monday, July 5, 2010

మహార్ణవం

చిన్నప్పుడు లైఫ్ భలే ఉండేది. ప్రతి రోజు స్కూల్ అయిపోగానే లైబ్రరీ కి వెళ్లి పేపర్ తిరగేసే వాడిని. చందమామ, చిన్నారి లతో పాటు స్వాతి కూడా తిరగేసేసే వాడిని. సరసమయిన కథల సంగతి గుర్తు లేదు కాని సీరియల్స్ బాగానే చదివేవాడిని. టైం కరెక్ట్ గా తెలియదు కాని కనీసం పది సంవత్సరాలు అయి ఉంటుంది - మహార్ణవం అనే సీరియల్ మాత్రం చాలా బాగా ఉండేది. సినిమా భాష లో చెప్పాలంటే స్నేహం, ప్రేమ, ప్రతీకారం ఉండే యాక్షన్, లవ్ స్టొరీ.

ఒక ఊరి లో ముగ్గురు భూస్వాములు ఉంటారు - సుబ్బయ్య, సీతా రామయ్య, మూడో వాడి పేరు గుర్తు లేదు. అదే ఊర్లో వాసు, శివ అని ప్రాణ స్నేహితులు ఉంటారు. శివ వైజాగ్ ఆంధ్ర యునివర్సిటీ లో చదువుతూ ఉంటాడు. ఇక్కడ వాసు ఒక భూస్వామి కూతురిని ప్రేమిస్తాడు. అది తెలిసిన వాళ్ళు ఒక స్వామీజీ సాయంతో భయంకరమయిన వర్షం పడేరోజు, ఊరి చివర భయంకరంగా చంపేస్తారు. శివ కూడా ఒక బూస్వామి కూతురి ఉమ ప్రేమించుకుంటారు. శివ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఎలా తప్పించుకున్నాడు అన్నదే కథ.

కథ ఎలా మొదలవుతుందంటే బస్సు వెళుతూ ఉంటుంది. అదే సమయానికి రోడ్డు ప్రక్కన సుబ్బయ్య నడుస్తూ ఉంటాడు. డ్రైవర్ కి ఒకేసారి చేతి నరాన్ని ఎవరో తిప్పేసినట్లు అనిపిస్తుంది. బస్సును కంట్రోల్ చేయలేక సుబ్బయ్యను గుద్దేస్తాడు. కథ వర్ణించడం మహా అద్భుతంగా ఉంటుంది. తరువాత ఒక్కొక్కడినీ ఒక్కోలా ప్లాన్ వేసి చంపుతాడు. చివరికి వీడే అని తెలిసిపోతుంది. కాని శివ, ఉమ తెప్పించుకుంటారు. నాకు ప్రతీ సన్నివేశం గుర్తుకు లేదు కాని, చాలా చాలా బావుంటుంది. అపుడపుడూ అనిపిస్తూ ఉంటుంది - స్వాతి పాత కాపీలు సంపాదించి మళ్ళీ చదవాలి అని. చూడాలి.

చెప్పడం మరిచా - రైటర్ పేరు - కరిముల్లా ఘంటసాల.
Continue Reading →

ఒక అందమయిన సాయంత్రం ...

బీచ్ లో బాగా ఆడి, అలసి పోయి, తడిచి పోయి, ఇసుకలో కూర్చుని, చల్లని గాలి ఒంటికి తగులుతుండగా - అస్తమించే రవి ని చూస్తుంటే భలే ఉంటుంది ....

అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట ఆరెంజ్, బ్లూ కలర్స్ కలసి చాలా, చాలా రొమాంటిక్ గా ఉంటుంది.







Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts