Friday, December 31, 2010

అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు ...

అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు ... ఇంజెన్ కెపాసిటి ఎక్కువ, పవర్ ఎక్కువ, రిక్వైర్మెంట్స్ ఎక్కువ, కొనాలంటే డబ్బులు ఎక్కువ, పైగా మన రోడ్ల మీద నడవడం కష్టమే.  

అమ్మాయికి కొంచం డబ్బులుండి, అందం ఉండి,  కొంచం చదువుకొంటే హయబుస లా తయారవుతుంది ... నాలాంటి సామాన్యుడికి దక్కించుకోవడం కష్టమే ... మధ్యలో ఈ కేస్ట్ ఒకటి ... ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే,  తక్కువ అబ్బాయిని ఎక్కువ అమ్మాయి ఇష్టపడదు,  ఎక్కువ అబ్బాయినీ ఇష్టపడదు ...  [ నిజమే, అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు .... ],  పైగా జీతం ఎక్కువ ఉండాలంట ... ఇప్పుడు మరీ అంత ఎక్కువ కాకపోయినా, ముందు ముందు పెరుగుతుంది కదా ...

ఇంతకీ విషయం ఏమిటీ అంటే ఒక మాట్రిమోనియల్ సైట్ లో  ఒక చందమామ ను చూసాను ... మెయిల్ కొట్టాను ... ఒక మూడు రోజుల తరువాత డిక్లైన్ చేసింది ... ఆ కళ్ళు మాత్రం అద్భుతం ... నాకు దక్కలేదు కదా అందుకే ఈ ఏడుపు ... నా మిత్రుడు ఒకడు వాళ్ళ ఆఫీసు లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసాడు ... చాలా మంచోడు ... ఆ అమ్మాయి కేస్ట్ ను  కారణం గా చూపించి కుదరదు అని చెప్పింది ... కేవలం కేస్ట్ కారణంగా  ఇలా చేయడం ఎందుకో బాలేదు కదా !!!
Continue Reading →

Saturday, December 18, 2010

యెర్ర బస్సు ...

యెర్రని దుమ్మును రేపుకుంటూ ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క బస్సు ఆగింది ... ఆందోళనకారులు నాలుగు బస్సులను దహనం చేసారు ... రేపటి నుండి ఆటో యూనియన్ల ఆందోళన - ఎక్కువ సర్వీసులను నడపాలని ఆర్.టీ.సి నిర్ణయించింది ... ఏంట్రా యెర్ర బస్సు ఎక్కి వచ్చేసావా ??? ... నాకు తెలిసి ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆర్.టీ.సి కి ఉన్న స్థానం చిన్నది కాదు అని నా అభిప్రాయం ...


ఈ మధ్య తణుకు నుండి రావులపాలెం వెళ్ళేటప్పుడు ఆర్.టీ.సి బస్సు ఎక్కాం బావ, నేను ... 'జల్' తుఫాను వల్ల విపరీతం గా వర్షం కురుస్తుంది ... బస్సు లోపలకు, అద్దాలను దాటి చినుకులు పడుతున్నాయి. సీట్ల నిండా నీరే ... బావ ఆర్.టీ.సి ను తిట్టాడు ... నాన్న గత పాతిక సంవత్సరాలుగా ఆర్.టీ.సి లో పని చేస్తుండడం వలనో, ఆ కారణం చేత చిన్నప్పటి నుండి ఎక్కువగా బస్సులలో తిరగడం వల్ల అయితేనేమి ఆర్.టీ.సి బస్సులంటే నాకు ఎందుకో అదో ఇష్టం ... బావ అలా అనడం తో నాకు బాధగా అనిపించింది ...


ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మిగతా స్టేట్స్ లో బస్సులు ఎలా ఉంటాయో తెలియదు కాని, మన బస్సులు బావుంటాయి, మంచి కండిషన్ లో ఉంటాయి అని నా అభిప్రాయం. దాదాపు ఇరవై వేల బస్సులతో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది. కాని, అదేంటో  ఎప్పుడు చూసినా బస్సుల లోంచి వేలాడుతూ ఉంటారు. అసలు ఎవరూ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఆర్.టీ.సి ను ఇష్టపడతారని నేను అనుకోను. నిజమే, టీ.వి లు ఉండవు, ఉన్నా పని చేయవు. ప్రతి డిపో లోను ఆపుతాడు. పన్నెండు గంటల ప్రయాణం పదిహేను గంటలు పడుతుంది. సరే, దూర ప్రయాణాల సంగతి వదిలేద్దాం. ప్రైవేటు బస్సులు బావుంటాయి అని పోగిడేస్తాం గాని, వాళ్ళు నడుపుతుంది లాభాల కోసమే గాని సేవ చేయడానికి కాదు కదా. మన రాష్ట్రం లో ఇన్ని వేళ పల్లెలు ఉన్నాయి. దాదాపు ప్రతి చోటకు బస్సులు నడుపుతుంది ఆర్.టీ.సి నే కదా. జనంతో బస్సు నిండినా, నిండకపోయినా బస్సు నడుస్తుంది కదా.


నిజమే, ప్రైవేటు బస్సులతో పోటీ పడాలంటే ఇంకా బాగా పని చేయాలి. బస్సులను మంచి కండిషన్ లో ఉంచాలి, టైము కు గమ్యం చేర్చాలి, ఇలా ఎప్పుడు జరుగుతుంది ?? నేను కూడా మా ఇంటికి వెళ్ళాలంటే ప్రైవేటు బస్సులోనే వెళ్తాను ...
Continue Reading →

ఒక అమ్మాయి - రెండు బొట్టు బిళ్ళల కథ ...

అమ్మాయీ లేదు,  కథ లేదు గాని చిన్న విషయమే.  చాలా కాలం గా  గమనిస్తున్న విషయం.  అదేంటో అమ్మాయిలు రెండు బొట్టులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.  అందమయిన అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారు.  మామూలుగా కన్నా అందంగా కనిపిస్తారు. రెడీమేడ్ బొట్టు బిళ్ళలు కాకుండా, కుంకుమ వాడతారు అనుకుంటాను. జనరల్ గా గుడి కి వెళ్ళినపుడు ఇలా జరుగుతుందేమో.  గుడికి వెళ్లేముందు తల స్నానం చేసి చక్కగా తయారవుతారు కదా.  అంటే బావుంటారు. ఆ అందానికి,  ఈ అందం ఇంకొంచం అందం తెస్తుందేమో ...
Continue Reading →

వెన్నెల్లో ఆడపిల్లా ...

ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్  రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని,  స్టోరి తెలియదు.  అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ... ఐ లవ్ యు '  ఈ నవల ఆధారం గా వచ్చిన సినిమా అని తెలిసినా, చూడలేదు.  సాయి కిషోర్  చెప్పాడు ... హీరో చెస్ ప్లేయర్ అని,  ఒక పోటీ లో  కళ్ళకు గంటలు కట్టుకుని గెలుస్తాడని,  అందుకు హీరోయినే హెల్ప్ చేస్తుంది అని ... నేను అదే క్లైమాక్స్ అనుకున్నాను ... వాడు గెలుస్తాడు,  పెళ్లి చేసేసుకుంటారు ... హ్యాపీ ఎండింగ్ అనుకున్నాను ... కాని నవల కొని చదివిన తరువాత గుండె పట్టేసింది ... అరరే అనిపించింది ... చిన్నప్పటి నుండి నాకు ట్రాజెడీ సినిమా లు నచ్చవు ... చదివేసిన చాలా సేపటి వరకూ ఏదో బాధ నన్ను వెంటాడుతూనే ఉంది ... బహుశా ఈ నవల చదివిన ప్రతి ఒక్కరికీ ఇలానే అనిపిస్తుందేమో ... చివరి వరకూ ఆమెను చూడడు,  చనిపోయిన తరువాత కూడా చూడడు ... ఇలా ఎందుకు జరిగింది ... హాయి గా  ఆమెకు క్యూర్ అయిపోయి పెళ్లి చేసేసుకుంటే యెంత బావుండును అనిపిస్తుంది ... కాని,  అది అలా ఉండడం వలనే ఇప్పటివరకూ గుర్తు ఉందేమో ... అసలు ఆమె గురించి చెప్పడం అద్భుతం ... చదువుతుంటే కళ్ళ ముందే కదిలింది ...
Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts