Sunday, January 23, 2011

రవితేజం ...

బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరికీ తెలిసింది బహుశా 'సింధూరం' సినిమా తో అనుకుంటాను.   తరువాత  'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్'  సూపర్ గా ఉంటాయి.

'నిన్నే పెళ్ళాడుతా' లో నాగార్జునతో డిస్కో లో కొట్టించుకున్న ఒక చిన్న క్యారక్టర్ లో ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద హీరో కావడం బావుంది. అసలు మన సినిమాలో చాలామంది హీరోలు, హీరోలుగా ఉండడానికి కారణం వాళ్ళ బ్యాక్ గ్రౌండే కదా.  అసలే గ్రౌండూ లేకుండా ఇప్పుడిలా ఉండడం గొప్పే కదా !!! 
Continue Reading →

Tuesday, January 18, 2011

సరిగా ఐదు సంవత్సరాల క్రితం ...

                                              
నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా  'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ?

అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి వెళ్ళి వచ్చి ఇక్కడ దిగాను ... నేను, హరిగాడు ఆటోలో దిగాం ... అప్పటికే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆ రోజున జాయిన్ అవుతున్న ముప్పై రెండు మంది పేర్లు ఉన్నాయి ... మా దగ్గర ఆఫర్ లెటర్స్ వెరిఫై చేసి లోపలికి పంపించాడు ... అప్పటికే ఇద్దరు అందమయిన అమ్మాయిలు  కూర్చున్నారు ... నేను, మా హరిగాడు వాళ్లకు ఎదురుగా కూర్చున్నాం ... పలకరించుకోలేదు గాని ... నేను ఆ ఇద్దరిలో పొట్టి అమ్మాయినే చూస్తున్నాను ... దేవుడు కొంచం పొడుగ్గా పుట్టించొచ్చు కదా ఈ అమ్మాయిని అనుకున్నాను ... కొంతసేపటికి అందరూ వచ్చేశారు ... ఎవరికి వారు బాచ్ లుగా విడిపోయారు ... ఇంట్రడక్షన్,  బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చెయ్యడం,  ఆఫీసులో  అటూ, ఇటూ తిరగడం ... అలా, అలా గడచిపోయింది ... పెద్దగా ఎవరినీ పలకరించలేదు ... 

మా బాచ్ లో దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ... ఒక లవ్ మారేజ్ కూడా ... రెండోది కూడా 'ఆన్ ది కార్డ్స్' ... చెత్త లాగ నేనూ ఉన్నాను ... ఒక లవ్వు లేదు, ఒక పెళ్లి లేదు ...
Continue Reading →

Monday, January 17, 2011

సంక్రాంతి ... ఓకే ... బానే ఉంది ...

ఈ సంవత్సరం సంక్రాంతి ఏదో అలా, అలా గడచిపోయింది. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది.  ఆ  భోగి మంటలు, బంతి పూలు,  లంగా వోణి అమ్మాయిలు,  పాపి కొండలు ట్రిప్  ... అన్నీ చూసి ఉండేవాడిని ... కాని మా టీం మేట్ పెళ్లి కేరళలో ఉంది. ఆఫీసుకి ఒకరోజు డుమ్మా కొట్టేసి నాలుగు రోజులు కేరళలో ఉందామని ప్లాన్.  చెత్తలాగా  నాతొ వచ్చేవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక నేనూ వెళ్ళలేదు.  టైం బావుండి హైదరాబాద్ కు టికెట్ దొరికింది. కాని అన్నీ కష్టాలే.  బస్సోడు ఎక్కడికో రమ్మన్నాడు. ఆటోవాడు ఎక్కడికో తీసుకెళ్ళాడు.  హిందీ మాట్లాడడం సంగతి అలా ఉంచితే,  అర్థం కావడం కూడా కష్టమే ... తెత్తేతే ... మెమెమ్మే ... గంట సేపు చలిలో నిల్చుంటే మొత్తానికి వచ్చాడు ... సీటులో కూర్చున్నాను ... కొంతసేపు వీపు మీద దురదలు మొదలయ్యాయి ... దోమలేమో అనుకున్నాను. ఓకే, ఇవి కూడా హైదరాబాద్ వస్తున్నాయేమో అనుకుని ఊరుకున్నాను.  కొంతసేపటికి బస్సులో గోల, గోల.  అందరూ దురదలు, దురదలు అంటూ అరవడం మొదలెట్టి, డ్రైవర్ మీద అరుస్తున్నారు.  అప్పుడు ఆడు చల్లగా చెప్పాడు ... అవి నల్లులు కావచ్చేమోనని ... సీట్ల మీద ఏదో స్ప్రే చేసి నల్లులను నిద్రపుచ్చేసాం ... తెల్లవారు జామున మూడు గంటలకు అనుకుంటా మెలకువ వచ్చేసింది ... చూస్తే బస్సు ఆగిపోయి ఉంది ... యాక్సిడెంట్ యిది ముందు ... ఒక గంటన్నర జామ్ ... మొత్తానికెలాగో  వచ్చేటప్పటికి తొమ్మిది అయింది.

'మిరపకాయ్ '  చూసేసా భోగి రోజు ... బేసిక్ గా నేను రవితేజ ఫ్యాన్ ను కానప్పటికీ  తన సినిమాలు కొన్ని బావుంటాయి ... నాకు నచ్చేసింది ... ఇంటర్వల్ అప్పుడే వచ్చేసిందా అనిపించింది. కాని సినిమా మొత్తం అయ్యేటప్పటికి  కొంచం పెద్దదిగా అనిపించింది.  సినిమా చూసి ఊరుకుంటే పరవాలేదు కాని,  హీరో ప్లేసులో మనల్ని ఊహించుకుంటేనే  ప్రాబ్లం ... ఆ సాయంత్రానికి నా బ్యాగ్ లోకి  మూడు కొత్త షర్టులు వచ్చాయి.  సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంది.  పాటలు ఓకే.  కామెడి ఓకే. 

నెక్స్ట్,  'అనగనగా ఒక ధీరుడు' ... వెళ్లేముందు నరేంద్ర అన్నాడు ... కార్టూన్ సినిమాలు ఏం చూస్తావు అని ... కాని, అంత పెద్ద డిస్నీ తెలుగు లో సినిమా తీస్తుంది ... ఎలా ఉంటుందో అన్న ఇది ఉంటుంది కదా ... ఎందుకో అంత నచ్చలా ... నేను మాత్రం శృతి హాసన్ ఎప్పుడొస్తుందా అనే చూసాను ... అందంగానే చూపెట్టాడు ... మా పవన్ గాడు చెప్పాడు ... కమల్ హాసన్, సారిక ల ప్రోడక్ట్ కదా, అలానే ఉంటుంది మరి అని ... సినిమాను ఇంకొంచం బాగా తీయోచ్చేమో ... అంతా మోహన్ బాబు కూతురు, సిద్దార్థ్ లనే చూపెట్టాడు.  నిన్న ఏదో చానెల్ లో వచ్చిన ప్రోగ్రాంలలో కూడా చెత్తలాగ  అంతా ఈ సిద్దార్థ్ యే మాట్లాడాడు. ఈ అమ్మాయికి చాన్స్ ఇవ్వలేదు.

ఇక, గోల్కొండ హై స్కూల్ ... నేనేయితే దీనికి టైం ను చంపెయ్యడానికే చూసాను.  బానే ఉంది. 

అదీ ... నచ్చనిది ఏంటంటే  పండగ అంతా  ఈ సినిమాలతోనే అయిపోవడం.  ఇంటికెళ్ళి  ఉంటే బావుండేది.   సండే 'శివ శివ శంభో' కూడా చూసేసాను.  నాకు ట్రాజెడీ సినిమాలు ఇష్టం ఉండవు. అందుకు ఇంతకుముందు చూడలేదు.  కాని చాలా బావుంది.  తమిళ్ లో ఇది హిట్ అట. తెలుగులో ఫ్లాప్.  ఫ్రెండ్స్ ప్రేమ కోసం లైఫ్ ను రిస్క్ చేయడం.  నచ్చింది. 

వచ్చే సంవత్సరం అయినా కొత్త, కొత్తగా  జరుపుకోవాలి.   
Continue Reading →

Sunday, January 9, 2011

నా బొమ్మకు పేరు పెట్టాలి ...

బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది.  ఎందుకో చూడగానే నచ్చేసింది.  ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా జుట్టు ఉంది, కాని అది కాదేమో. 

ఆ కళ్ళు చూస్తుంటే ఏదో అమాయకత్వం, భయం ... ఏమీ అర్థం కానట్లు.  అందుకీ దీనికి ముద్ద పప్పు అని పేరు పెట్టేసాను.  ఎలా చూస్తుందంటే మనకు ఏమి అర్థం కానప్పుడు కళ్ళప్పగించి చూస్తామే అలా ...
Continue Reading →

Saturday, January 8, 2011

చెప్పడం కష్టమే ?

కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే.  వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు.  మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు. 

నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం,  జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని  చూస్తే నాకు సీ హార్స్ గుర్తుకు వచ్చింది.      


సీ హార్స్ కళ్ళు చాలా అందంగా ఉంటాయి.  జడ అయితే నడుము వరకూ ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు కాని,  పొడుగు జడ ఉన్న గుర్రాలంటే నాకెందుకో ఇష్టం.  ఈ సీ హార్స్ ను ఇష్టపడడం మొదలెట్టాను. ఒకసారి ఏమయిందంటే ఈ సీ హార్స్  వైలెట్ కలర్ చీర కట్టుకుని వచ్చింది.  ఎప్పుడూ ఈ నీటి గుర్రాన్ని చీరలో చూడలేదు కదా,  ఫ్లాట్ అయిపోయాను.  ఈ నీటి గుర్రానికి ఒక మట్టగడస ఫ్రెండ్ ఉంది.  చెత్త చేప.  ఏదో ఒక సందర్బంలో నేను అన్న మాటలు  నా సీ హార్స్ తో చెప్పింది. కొన్ని చెత్త సలహాలూ ఇచ్చింది.  మొదట్లో బానే ఉన్న నా సీ హార్స్ మాట్లాడడం మానేసింది.  కొంతకాలానికి వాడెవడో వల వేసి పట్టుకుపోయాడు.  ఆ మట్టగడస కు కూడా పెళ్లి అయిపోయింది.

నేనేమీ దేవదాసును కాను కదా,  ప్రతి చేపకు ఎవరితో పెళ్లి కావాలో ఆ దేవుడు పుట్టినపుడే రాసేస్తాడు.  పైగా మన జాతకం లో గురుడు, చంద్రుడు ఎప్పుడూ కలసి లేరు. సో, మనకు ప్రేమ అచ్చి రాదు.   నాకు తెలుసు ఈ మట్టగడస మాటలు,  సీ హార్స్  బ్రెయిన్ ను  ప్రభావితం చేయనప్పటికీ  ఎందుకో నాకు చిరాకు.  నా సీ హార్స్ పౌర్ణమి చందమామ కానప్పటికీ నాకెందుకో అదో ఇది ...
Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts