Sunday, January 31, 2010

వెన్నెల రాబోతుందా ?

నేను ఏమి బావను కాను, అందంగా కవితలు చెప్పడానికి. ఫీలింగ్స్ ఏమి లేని వాడిని కాదు ఏమి చెప్పకుండా ఉండడానికి . నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్న వాడిని !!!

లాస్ట్ వారం రోజుల నుండి నా ఆలోచనలు అన్నీమారిపోయాయి నీ ఆలోచనలతో . బావ ఒకరోజు ఉదయాన్నే కాల్ చేసి చాలా మంచి సంబంధం అట అని నీ గురించి చెప్పేటప్పటికి నేను ఎదురు చూస్తున్న చందమామ నువ్వేనా అనిపించింది !!! నా తూర్పు గోదావరి లో పుట్టిన, కళ్ళజోడు పెట్టుకున్న, పొడుగు జడ ఉన్న, అందమయిన వెన్నెల కురిపించే అమ్మాయివి నువ్వేనా అనిపించసాగింది. అంత లోనే ఎన్నో అనుమానాలు, భయాలు !!! ఇద్దరికీ మధ్య ఏడు సంవత్సరాలు డిఫరెన్సు. తప్పు ఏమో అని. అమ్మ చెప్పింది పది సంవత్సరాలు కూడా ఉంటాయి అని. ఎలాగో కన్విన్స్ అయిపోయాను. ఇంజనీరింగ్ అవకుండానే అప్పుడే పెళ్లి చేసెయ్యడానికి అంత తొందర ఏమిటి ?

నీ ఎత్తు అయిదు అడుగుల ఏడు అంగుళాలు అట. మామూలుగా ఇంత ఎత్తు ఉన్న అమ్మాయిలూ దొరకడం కష్టమే !!! నాన్న నిన్ను సపోర్ట్ చేయడానికి నీ యత్తే కారణం. నీకు కళ్ళజోడు ఉందట. అమ్మకు ఎందుకో నచ్చావో తెలియదు, తనతో మాట్లాడితే ఈ రోజుల్లో అది అందరికీ కామన్ అని నన్ను కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. తనకు తెలియదు నాకు ఎందుకో కళ్ళజోడు ఉన్నవాళ్ళు అంటే ఇష్టమని.

భారతి అత్త నీ ఫోటో చూసి అనాలసిస్ చేసింది. ఏదో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావట. ఆంజనేయ స్వామి బొట్టు నుదిటి మీద, మెడ మీద ఉంది. అంటే నీకు దైవ భక్తీ ఉంది. వేలికి uనగరం ఉంది. అంటే గ్రహాల పట్ల, నమ్మకం ఉంది. మన వాళ్లకు పంపిన ఫోటో స్టుడియోలో తీసింది కాదు. ఇంట్లో తీసింది. అంటే నీ వెన్నెల నిజమయిందే !

సాధారణంగా స్టుడియోలో తీసిన ఫోటోలు అంత నిజం కాదు. మామూలు ఫోటోలోనే ఇంత అందంగా ఉంటే నిజం గా ఎలా ఉంటావో ?? అత్తకు సాధారణం గా ఎవరూ నచ్చరట, ఐశ్వర్యా రాయ్ అయినా !!! అటువంటిది నువ్వు నచ్చావంటే అమ్మో ఎలా ఉంటావో ?? వాళ్ళు ఏలూరు వెళ్తే, ఎవరో తెలిసిన వాళ్ళు నీ గురించి చెప్పారట. బావ అంటున్నాడు, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా నీ గురించి చెప్పారంటే నువ్వు ఎలా ఉంటావో ?? అత్తకు, అమ్మకు, నాన్నకు, మామకు అందరికీ నచ్చేసావు. నువ్వు ఎలా ఉంటావో ?

అనవసర బయాలు అంతలోనే ! నీ జాతకం, నా జాతకం చూసి ఇద్దరికీ అంత కలవలేదు అని ఎవరో చెప్పారు. బయపడ్డాను. అయినా నన్ను నేను కన్విన్స్ చేసేసుకున్నాను. ఏమో ఎప్పుడో ఇరవయి సంవత్స రాల క్రితం నువ్వు పుట్టిన టైం కరెక్ట్ గా నోట్ చేసారు అని గారంటీ ఏమిటి. ఒక్క సెకను తేడా వచ్చినా జాతకాలు మారిపోతాయి. అటువంటిది జాతకాలను ఎలా నమ్మను ? మీ వాళ్ళు జాతకాలు చూడరు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. దేవుడా థాంక్స్ !!! నీ గురించి మాటలాడుతుంటే బావ చేతిలోని ఫోను కింద పడి ముక్కలు అయిపోయిందట.

నిన్ను చూడడానికి ఇంకో పది రోజులలో మన గాంగ్ కాకినాడ బయలుదేరుతున్నారు. ఏమవుతుందో ?? వీళ్ళు అందరి మాటలతో నాకు ఏమి అనిపిస్తుందంటే నీ ఫోటో అయినా చూడకుండా నిన్ను చేసేసుకోవాలని !!! నీ జాతకం లో ఈ సంవత్సరం పెళ్లి కాదు అని ఉందట. ఈ మాటే నన్ను బయపెడుతుంది. కాని ఒకటి నిజం. దేవుడు ఎవరిని రాసి పెడితే వాళ్ళతో జరుగుతుంది. చూద్దాం ఏమి జరుగుతుందో !!! లాస్ట్ ఇయర్ ఒకతను చెప్పాడు నాకు, "నీ పెళ్లి ముందు చాలా ప్రొబ్లెంస్ ఉంటాయి అని". ఎటువంటివి అయినా క్లియర్ చేసేయొచ్చు, బావ హెల్ప్ తో.

కాని నేను నీకు నచ్చానా ? నువ్వు నాకు నచ్చుతావా ? వేరే అమ్మాయి గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు. నీ గురించి నా బ్లాగులో రాసాను అంటే నువ్వే నా చందమామ అని నమ్ముతున్నాను. ఇప్పటివరకూ నీ అందం గురించి తప్ప , నీ వ్యక్తిత్వం, ఆలోచనలు, ఇష్ట ఇష్టాలు ఏమి మాట్లాడలేదు. తూర్పు గోదావరిలో, మంచి కుటుంబం లో, చందమామను కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్న నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉంటావని నమ్ముతున్నాను.

ఇవీ నీ గురించి నా ఆలోచనలు. టైం తెల్లవారు జామున మూడు అయింది. రేపు ప్రొడక్షన్ లో పెద్ద ఇన్ స్టాల్ ఉంది. పడుకోవాలి. దేవుడు ఏమి చేస్తాడో చూద్దాం !!!

1 comments:

Anonymous said...

mari vennela vachinda leda???

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts