Monday, March 29, 2010

గొంతులో తేనె పోస్తే ...

ఒకసారి హరిహరన్ ను ఎవరో అడిగారు - "మీకు నచ్చిన, మీకు ఇచ్చిన పొగడ్త ఏది ?" అని. అపుడు ఆయన చెప్పాడు. " దోసేళ్ళతో తేనెను తీసుకుని గొంతులో పోస్తే ఎలా ఉంటుందో, మీ పాట వింటున్నపుడు అలా ఉంటుంది " అని ఒకావిడ చెప్పిందట. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కాని, అన్నయ్య సినిమా రాక్షసుడు లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాట వింటున్నపుడు అలానే అనిపిస్తుంది. అసలు పి. సుశీల గొంతు అద్భుతం.
Continue Reading →

విరించి అంటే ...

ఈ మధ్య సిరివెన్నెల సినిమాలో "విధాత తలపున" సాంగ్ ఎక్కువ సార్లు వింటున్నాను. మాటి మాటికి విరించి, విరించి అని వస్తూ ఉంటుంది. నేనూ విరించి అన్న పదాన్ని ఇంతకూ ముందు విన్నాను. కాని అర్థం తెలుసుకోవాలని ఎప్పుడూ ట్రై చెయ్యలేదు. సరే అని, గూగుల్ లో వెతికాను. అప్పుడు తెలిసింది, విరించి అంటే బ్రహ్మ అని. బ్రహ్మ లు ఏడుగురు ఉంటారట. అందులో మొదటివాడే విరించి. ఇతని పని అయిపోయిన తరువాత, అంటే ఒక కల్పం తరువాత నెక్స్ట్ బ్రహ్మ వస్తాడు. ఇదంతా నాకు ఈ సైట్ లో తెలిసింది - ఇంకా చాలా వెతకాలి.

http://kduvvuri.blogspot.com/

అదీ సంగతి ...

Continue Reading →

Sunday, March 28, 2010

గోవిందా ... గోవింద ...

నేను ఉండే ప్లేస్ కు దగ్గరలో Aurora అని వేరే ప్లేస్ ఉందిలే. దగ్గర అంటే దగ్గర కాదు. కారులో ఒక నలభై నిముషాల పైనే పడుతుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ అందరూ అరోరా టెంపుల్ అని అంటూ ఉంటారు. ఇంతకు ముందు ఇక్కడకు రాక ముందు అనుకున్నాను - బాలాజీని ఇక్కడ అరోరా అని కూడా అంటారని. కాని అది తప్పు. అరోరా అనేది ఆ ప్లేస్ పేరు. అదేంటో నాకు అర్థం కాదు అరోరాలు ఇక్కడ చాలా ఉంటాయి.గుడి చాలా అందం గా ఉంటుందిలే. చుట్టూ విశాలమయిన ప్రదేశం, ఎదురుగా చిన్న కొలను, ఎటువంటి గోల లేని వాతావరణం. బావుంది. ధ్వజ స్తంభం లేనట్లుంది. నేను సరిగా చూడలేదా ? షూస్ విప్పి, చేతులు కడుక్కుని పైకి వెళ్ళాం. మెయిన్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా అన్నీ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి.

ఈ మధ్యనే యు ట్యూబ్ లో ఒక క్లిప్ చూసాను - రాయలసీమ రామన్న చౌదరి సినిమా లోనిది. మోహన్ బాబు చంద్ర మోహన్ ను అడుగుతాడు - అసలు జనాలంతా దేవుడికి మొక్కుతున్నది దేవుడి మీద భక్తి తో కాదు అని. తాము పెట్టింది దేవుడు తినేస్తాడు అంటే అంటే ఎవడు గుడికి వెళ్ళడు, గుండు చేయించుకున్న తరువాత జుట్టు రాదు అని తెలిస్తే ఎవరయినా గుండు కొట్టించుకుంటారా అని. నిజమే కదా అనిపించింది. అది ప్రక్కన పెడితే మోహన్ బాబు యాక్షన్ అద్బుతం. నేను గుడికి వెళ్ళింది భక్తితో కాదు. అక్కడ దొరికే ఫుడ్డు గురించి. అంటే నాకు భక్తి లేదు అని కాదు. దేవుడిని నమ్ముతాను. పొద్దున్నే లేచి దేవుడికి గుడ్ మార్నింగ్ చెబుతాను కాని గుడికి వెళ్ళడం తక్కువే. కాని అదేంటో గుడికి వెళితే అదోరకమయిన ఫీలింగ్ వచ్చేస్తుంది.


చిన్నప్పుడు తెగ కోరికలు కోరుకునేవాడినిలే. కాని తరువాత అనిపించింది - నీకు ఏది మంచిదో నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా ? అని. అటువంటప్పుడు మళ్లీ కోరుకోవడం దేనికి. జస్ట్ ఒక నమస్కారం పెడతాను అంతే.

సరే, మొత్తం అందరిని దర్శించుకుని కిందకు వచ్చాం - కాంటీన్ లోకి. ఇక దండయాత్ర మొదలెట్టాలి. నాకు తెలిసి అమెరికా వచ్చిన తరువాత తిన్న బెస్ట్ ఫుడ్డు లో ఇక్కడ దొరికేది ఒకటి. రెండు ప్లేట్లు వడ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పోలిహోర, రెండు గ్లాసులు లస్సి . ఇది మన మెను. నేనే కాదు, చాలామంది ఇక్కడ దొరికే ఫుడ్డు కోసమే వస్తారట. దేవుడా - థాంక్స్. ఇక్కడకు రావడం ఇది రెండో సారి.










Continue Reading →

ముచ్చటగా మూడో రోజు ...

ఇదేంటి రెండో రోజు ఏమయింది అనిపిస్తుంది కదా, అది అంత ఇంటరెస్టింగ్ అనిపించలేదు. అయినా ద్వితీయ విఘ్నం అధిగమించానులే. మన హీరోలు, డైరెక్టర్లు చాలా మంది రెండో సినిమాలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలియదు మరి ... దానినే ద్వితీయ విఘ్నం అంటారు.

లాస్ట్ శుక్రవారం క్లాసు ఉంది. వారం లో ఆఖరి రోజు కదా ఉత్సాహంగా untundi. పొద్దున్నే లేచి, తల స్నానం చేసి రెడీగా ఉన్నాను, రెనటా ఎప్పుడు వస్తుందా అని. ఎనిమిది గంటలకు వచ్చింది. డ్రైవింగ్ పర్మిట్ చూపించి, డ్రైవింగ్ సీట్ లో కూర్చుని సీటు, మిర్రర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని, దేవుడిని talachuquni కొంతసేపు స్టీరింగ్ ప్రాక్టీసు చేసి కారు స్టార్ట్ చేసాను. మళ్లీ రేసిదేన్షియాల్ ఏరియా కు వెళ్లి టర్నింగ్ ప్రాక్టిస్ చేసాను. ఎందుకో ఈ రోజు ఛాలా
Continue Reading →

Sunday, March 21, 2010

కారు నేర్చుకుంటున్నానోచ్ . .

జీవితంలో కొన్ని కొన్ని మొదటి రోజు/మొదటి సారి చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి , అది కాలేజ్ లో అడుగుపెట్టడం కావచ్చు, కంపెనీ లో అడుగుపెట్టడం కావచ్చు, నచ్చిన అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం కావచ్చు, ఏదయినా కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తరువాత అమ్మ, నాన్నలు పంపిన మొదటి అమ్మాయి ఫోటో కావచ్చు, ఇంకా చాలా, చాలా... మన తత్వవేత్త చెప్పినట్లు లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి ... అటువంటిది ఒకటి ఇవాళ మొదలెట్టాను నేను .. అది కారు నేర్చుకోవడం ...

అమెరికా లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. అది లక్జరీ కాదు, అవసరం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చాలా తక్కువ ... కారు లేకపోతె కాళ్ళు లేనట్టే !!! కారు కొనే ఆలోచనలేవీ లేకపోయినా ఒక రోజు మంచి కారు అద్దె కు తీసుకుని, బావ దగ్గరకు వెళ్ళాలి అని ఒక చిన్న కల ... ఇంకొకటి ఇక్కడి రోడ్లు అద్బుతం. ఎక్కువ దూరం కారులో వెళితే బాగా ఎంజాయ్ చేయొచ్చు.

నిన్ననే డ్రైవింగ్ స్కూల్ కు కాల్ చేసి ఇవాళ ఎనిమిది గంటలకు స్లాట్ బుక్ చేసాను. ప్రోదున్నే ఏడు గంటలకు లేచి చూసాను కదా మంచు కురుస్తుంది. అనుమానం వచ్చింది - ఏమి అవుతుందో అని. ఎనిమిది కల్లా కాల్ వచ్చింది రెనట దగ్గరనుండి. ఆమె నా ఇన్ స్ట్రక్టర్. ఇక్కడ కారు నేర్చుకోవాలి అంటే ముందు పర్మిట్ తీసుకోవాలి టెస్ట్ రాసి. అది మొన్నే అయింది. వెళ్లి పలకరించి, సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాను. ఒక రెసిడెన్షియల్ ఏరియా కు తీసుకువెళ్ళి ఆపింది. నన్ను డ్రైవింగ్ సీట్ లో కూర్చోమని చెప్పడం మొదలెట్టింది. కారు వెనక పార్ట్ ను అద్దం లో చూడడం, గేర్లు, స్టీరింగ్, బ్రేక్, అన్నీ చెప్పింది. ఇక తోలడమే తరువాయి.

దేవుడిని తలచుకొని బ్రేక్ మీద కాలు వేసి, గేరు మార్చి బ్రేక్ మీద కాలు తీసేసాను. కారు నెమ్మదిగా వెళ్ళడం మొదలెట్టింది. అప్పుడు పెడల్ మీద కాలు వేసి, స్పీడ్ పెంచడం మొదలెట్టాను. రెసిడెన్షియల్ ఏరియా కదా ఇరవై మైళ్ళ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. రోడ్డు ఏ మలుపులు లేకుండా ఉంటే వెళ్ళిపోతాం. కానీ మలుపులు ఉన్న చోటే నేర్చుకోవాలి. రైట్ టర్న్ తీసుకుంటూ, లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ, అద్దంలో చూస్తూ, ఆమె చెప్పేవి వింటూ, మెయిన్ రోడ్డు లో కూడా నడిపి చూసేటప్పటికి టైం అయిపోయింది. కొన్ని సార్లు ఇబ్బంది పడ్డాను. కాని ఓకే.

నెక్స్ట్ క్లాసు బుధవారం. ఆమెకు అరవై డాలర్లకు చెక్ ఇచ్చి బై చెప్పి వచ్చేసా. అరవై డాలర్లంటే మన డబ్బులో రెండు వేల ఏడు వందల రూపాయలు. మన కంపెనీ ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాది కాబట్టి సరిపోయింది కాని లేక పొతే మనకు మన డబ్బులు పెట్టి కారు నేర్చుకునే సీన్ లేదు. అదీ సంగతి. నాకు యెంత వీలయితే అంత తొందరగా నేర్చేసుకుని బావ దగ్గరకు వెళ్లిపోవాలి అని ఉంది. చూడాలి ... ఏమవుతుందో ...
Continue Reading →

Monday, March 15, 2010

రేపు అన్నది ఎలా ఉంటుందో .

మనలో చాలామందికి ఇవాల్టి కన్నా రేపటి గురించిన ఆలోచనలే ఎక్కువ. ఇవాళ యెంత బావున్నా అనుభవించకుండా రేపటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. రేపు ఎలా ఉంటుంది, మన జాబ్ ఎలా ఉంటుంది, మన జీతం ఎలా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలే. కొన్ని సార్లు ఏదో జరుగుతుంది అని భయపడిపోతుంటాం. ఎక్కడో చదివాను - నువ్వు పులికి బయపడు . . . సింహానికి బయపడు అంతే కాని రేపటికి బయపడుతున్నావేమిటి అని. నిజమే !

మనం సాధారణ మనుష్యులం కదా ... మనసు మన మాట వినదు. రేపటి గురించి తెలుసుకోవడానికి జాతకాలు, గ్రహాలూ, ఇటువంటివన్నీ చూసేస్తూ ఉంటాం. ఇదంతా నాణేనికి ఓక వైపు మాత్రమే. అసలు ఎక్కడో ఉన్న గ్రహాలను చూసి, వాటి గమనాన్ని బట్టి ఇలా జరగోచ్చు అని చెప్పడం గొప్పే కదా ! కొన్ని సార్లు ఇది జరగోచ్చు, లేకపోచ్చు. కొంతమంది కి నమ్మకం ఉండొచ్చు, లేకపోచ్చు. కాని, ఇది కూడా ఒక సైన్సే.

మన తత్వవేత్తకు వీటి మీద చాల ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ తత్వవేత్తకు పిచ్చి, పిచ్చి గా నమ్ముతాను. కానీ మరీ అంతే పిచ్చోడిని కాదు. మన జాతకం బట్టి, మనం వచ్చే జనవరి వరకు అమెరికా లోనే ఉంటాం. ఫిబ్రవరి లో పెళ్లి అవుంతుంది చందమామ లాంటి అమ్మాయితో. అమెరికా సంగతి ఏమో కానీ, చందమామ మీద చాలా ఆశలే పెట్టుకున్నాను నేను. ఒక వేళ అది జరగక పొతే, లేదు ... లేదు ... జరుగుతుంది అని నమ్ముతున్ననే నేను. సో, వేరే ఆలోచనలు అనవసరం.

చూద్దాం ... ఏమి జరుగుతుందో ... నమ్మడం వల్ల మనకు పోయినదేమీ లేదు కదా !!!
Continue Reading →

Thursday, March 11, 2010

పెరటిలో వంకాయ ...

మనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టేసరికి అమ్మ, నాన్నలు తెలిసినవారిలోను, బంధువులలోను ఎవరయినా అమ్మాయిలూ ఉన్నారేమోనని చూస్తారు. ఎందుకంటే పెళ్లి అంటే జస్ట్ అమ్మాయి ఒకటే కాదు కదా !! అమ్మాయి అందం, చదువు వీటితో పాటు అమ్మాయి అమ్మ, నాన్నలు , వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ ముఖ్యమే ! తెలిసినవారిలో లాభం ఏమిటి అంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకునే వీలు ఉంటుంది. ఈ మధ్య ఒక సంబంధం చూసారు. నాకు నచ్చలేదు. అపుడు ఒక ఐడియా వచ్చింది. ఏదయినా, మేట్రిమొనియాల్ సైట్ లో రిజిస్టర్ అయితే ఎలా ఉంటుంది అని. నాకు తెలిసిన ఒక తత్వవేత్త తో మాట్లాడాను. పెళ్ళికి, తత్వవేత్తకు సంబంధం ఏమిటి అంటారా ??? అదంతే !!!

అప్పడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మనకు తెలిసిన అమ్మాయి అంటే మనం ఇష్టపడి, ప్రేమతో ఇంట్లో పెంచుకునే మొక్కకు కాచిన వంకాయ లాంటిది. మనకు ఒక తెలియని ఇది ఉంటుంది. మనది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి లైఫ్ (కూర) కూడా బాగానే ఉంటుంది. అదే ఇటువంటి మేరేజ్ బ్యురోస్, ఇంటర్నెట్ సైట్ లలో ఎంచుకున్న అమ్మాయి అయితే హోటల్ కి వెళ్లి తిన్న కూర లాంటిది. వంకాయ ఎక్కడ కాచింది, దాని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్నవి తెలియవు. నువ్వు ఏమి చదివావు, ఏమి చేస్తున్నావు, నీ జీతం యెంత, ఏమి చెయ్యాలి అనుకుంటున్నావు ఇలా మెటిరియలిస్టిక్ గా ఉంటుంది.

మాటలు విన్న తరువాత నా నిర్ణయం మార్చుకున్నాను - కొంచం లేటు అయినా అమ్మ , నాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుందామని !!!
Continue Reading →

Sunday, March 7, 2010

చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...

నేను అమెరికా వచ్చి ఆరు నెలలు అయిపోయింది. ఇప్పటి వరకూ నేను చూసినవి ఏమన్నా ఉన్నాయా అంటే నాకు నచ్చని సమాధానం వస్తుంది, 'లేదు' అని. ఆఫీసులో జితన్, వంచి లాస్ వేగాస్ వెళ్దాము అని ప్లాన్ చేసారు. ముందు నేను రాను అని చెప్పాను. కాని కారులో వెళ్తున్నాము అని చెప్పేటప్పటికి టెంప్ట్ అయిపోయాను. ఆఫీసులో అబద్దం చెప్పాము, విమానంలో వెళ్తున్నాము అని. క్లైంట్ మేనేజేర్స్ కి రెండు రోజులు సెలవు తీసుకున్నట్లు చెప్పేసాము. నేను వెళ్ళడానికి కారణం ఏమిటంటే చికాగో నుండి లాస్ వేగాస్ అంటే 1800 మైళ్ళు. పసలపూడి నుండి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆ 200 కిలోమేటర్లకే సంబరాపడిపోయే నేను, ఇంత దూరాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తానో !!! Ford Explorer రెంట్ కు తీసుకున్నాము. మాతో శ్రీకాంత సిన్హా కూడా జాయిన్ అయ్యాడు. మొత్తం జితన్, వంచి, శ్రీకాంత్, నేను గురు వారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరాం.

ప్రయాణం లో పదనిసలు ఏమిటి అంటే, ఓక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. అది వదిలేసి నేను బయలుదేరాను. నా ఐడియా ఏమిటి అంటే, తెల్లవారు జామున రెండు గంటలకు నెట్ కు కానెక్ట్ అయ్యి ఏదో ఒకటి చేద్దాం అని. మూడు గంటలకు ఓమహా సిటీ చేరుకున్నాము. ఇంటర్నెట్ ఎక్కడ దొరుకుతుంది అని అలోచించి, పెద్ద, పెద్ద హోటల్స్ లలో వై-ఫై ఉంటుంది అని, వాటిని వెదకడం మొదలుపెట్టాము. Settle Inn అని దొరికింది. పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసి, కారులో నుండే నెట్ కు కనెక్ట్ అయ్యి పని చేయడం మొదలుపెట్టాను. అయిదు అయ్యేటప్పటికి laptop లో చార్జింగ్ అయిపోయింది. మళ్లీ టెన్షన్ మొదలు. ఇంతలో బావ చెప్పిన బంగారు మాట గుర్తుకు వచ్చింది - " 90 % స్టార్ బక్స్ కాఫీ షాపులలో ఇంటర్నెట్ ఉంటుంది" అని. జి.పీ.ఎస్ లో స్టార్ బక్స్ సెట్ చేసి వెళ్ళేటప్పటికి ఆరు అయింది. నా టైం బావుండి అక్కడ పని చేసే అందమయిన అమ్మాయి చెప్పింది. అయిదు డాలర్లు పెట్టి కూపన్ కొంటె రెండు గంటలు నెట్ వాడుకోవచ్చు. పని మొదలెట్టాను. ఎనిమిది గంటల కల్లా పని అయిపోయింది. ఓక ప్రక్కనుండి వీళ్ళ దొబ్బుడు. మెయిల్ కొట్టి, కాఫీ పట్టుకుని బయలుదేరాం. కొంచం టెన్షన్ పడినా, ఇదో మంచి అనుభవం.






నా విషయం చివరి వరకూ తెలియకపోవడం వల్ల ఎలా వెళ్తాము, ఎంత దూరం, యెంత సేపు పడుతుంది, ఏమేమి చూడాలి అన్నవి ఆలోచించ లేదు. అమెరికా రోడ్ల మీద గంటకు 80 మైళ్ళకు మించి వెళ్ళలేము. అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది. మాలో జితన్, వంచి కు తప్ప మిగతా ఇద్దరికీ డ్రైవింగ్ రాదు. ఇద్దరు మార్చి మార్చి డ్రైవింగ్ సీర్ మారి, మెక్ డోనాల్డ్ దగ్గర ఆగి, ఫోటోలు తీసుకుంటూ లాస్ వేగాస్ చేరేటప్పటికి శనివారం ఉదయం రెండు గంటలు అయింది. లింకన్ సిటీ దాటిన తరువాత ప్రయాణం ఇక అద్బుతం. ఎందుకంటే రోడ్డుకి ఇరుపక్కలా అంతెత్తున, మంచు తో తడిచి, ఎండలో మెరుస్తున్న అందమయిన కొండలు. వంపులు తిరిగి ఎన్నెన్నో మలుపులున్న రోడ్లు.

రెండు గంటల ప్రయాణం తరువాత యూట లోకి ప్రవేశించాం. ఇక్కడ ఇంకా అద్బుతం. వంద, నూట యాబయి మైళ్ళ వరకూ ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు.

ఇక్కడ చాలా జాగ్రత్తగా నడపాలి. తేడా వచ్చిందో ఇంతే సంగతులు.

వెనక సీట్లో జితన్, శ్రీకాంత్ నిద్ర పోతున్నారు. నేను, వంచి మాట్లాడుకుంటూ, మంచులో తడిచిపోయిన కొండలను చూస్తూ వెళ్తున్నాం.
రాత్రి రెండు గంటలు లాస్ వేగాస్ చేరుకున్నాం. అంటే దాదాపు ముప్పయి గంటల ప్రయాణం తరువాత.

ఈ ప్రక్కన ఫోతూలన్ని డెన్వర్ దాటిన తరువాత తీసినవి.












































దూరం
నుండి అంత రాత్రి వేళ లాస్ వేగాస్ లైట్లతో వెలిగిపోతోంది. వెళ్ళిన వెంటనే స్నానాలు చేసి, కదిలేటప్పటికి మూడు అయింది. మేము దిగిన హోటల్ The Signature . బేసిక్ గా లాస్ వేగాస్ ను ఎంజాయ్ ఎంజాయ్ చెయ్యాలి అంటే రెండింటిలో కనీసం ఒక్క ఇంట్రెస్ట్ అయినా ఉండాలి. నా ఉద్దేశం మిగతా వాళ్ళు ఎంజాయ్ చెయ్యలేరు అని కాదు.
() జూదం () అమ్మాయిలు. ఇప్పటివరకు ఇటువంటి వాతావరణం ఇంగ్లీష్ సినిమా లలో చూడడమే. నిజం గా చూసేటప్పటికి భలే ఆశర్యం కలుగుతుంది. చిట్టి పొట్టి డ్రస్సుల్లో అందమైన అమ్మాయిలను చూడడం కళ్ళకు పండగే.

కాసినో అంతా తిరిగి, కొంతసేపు అందరి ఆటలు చూసేటప్పటికి ఆరు అయింది. విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది. వచ్చి పడుకుండిపోయాం. మా హోటల్ నుండి చూస్తే :


లేచి, పన్నెండు గంటలకు కారేసుకుని ఊరు అంతా తిరిగాం . ఎన్నెన్నో వింత, వింత విశేషాలు తెలుస్తున్నాయి.

ముందే చెప్పుకున్నట్లు, ఇక్కడ కాసినోలు, స్ట్రిప్ క్లబ్బులు చాలా ఎక్కువ. రోడ్డు మీద ఎక్కడ చూసినా, అమ్మాయిలు, అమ్మాయిలు అని కార్డులు పంచిపెడుతుంటారు.




ఇదిగో ఇలా :











అమ్మాయిలు ... అమ్మాయిలు ...




















అలా
వెళ్తుంటే, ఇంకా ఎన్నెన్నో వింతలూ తెలిసాయి. అదేంటంటే

Drive thru marriages. ఏంటంటే, మీకు పెళ్లి చేసుకోవడానికి టైం లేక పొతే, కారు లో కూర్చుని

"I Do"అని చెప్తే పెళ్లి అనిపోయినట్లే.








అలా, హోవర్ డాం కు వెళ్ళాం. ఇది లాస్ వేగాస్ నుండి ఓక ముప్పయి మైళ్ళు ఉంటుంది. ఓక గంట సేపు ఫోటోలు దిగి, ఫోటోలు తీసి, తిరిగి వచ్చేటప్పటికి ఏడు అయింది. మళ్లీ, కాసినోకు బయలుదేరాం. బావ చెప్పాడు, "సముద్రం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా ఉంటే యెంత చండాలంగా ఉంటుందో, లాస్ వేగాస్ కు వెళ్లి డబ్బ్లు పోగోట్టుకోక పొతే అంటే చండాలంగా ఉంటుంది" అని. కాని నాకు ఇంటరెస్ట్ లేదు, గేమ్ రాదు కూడా. అయినా ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక సింపుల్ గేమ్ ఆడాను. కాసినో వాడికి ఒక పేక ముక్క, నాకు ఒక పేక ముక్క. ఎవరికి ఎక్కువ వస్తే వాడివే డబ్బులు. నాకు లక్ లేదు అని నాకు ముందే తెలుసు. అది మళ్లీ నిరూపించాను. నా ఒక్కడికే లక్ లేదు అనుకున్నాను. మిగిలిన వాళ్ళకు కూడా లేదు. మనకొక్కరికే పొతే ఏడుపు వస్తుంది కాని, మన పక్కనోడికి కూడా పొతే హ్యాపీనే !!! అలా, అలా మూడు అయిపోయింది. తిరిగొచ్చి, పడుకుని లేచేటప్పటికి పది అయింది.

ఇవాల్టి ప్లాన్ నడుచుకుంటూ అంతా చూడాలి అని. వాతావరణం కూడా అద్బుతంగా ఉంది. చల్ల గాలి తో పాటు ఎండ.
అదిరింది.

నీటికి కూడా డాన్స్ వచ్చు అని నాకు ఇది చూసిన తరువాతే తెలిసింది :


వెనకాల కనిపిస్తున్నది - బెల్లాజియో అని కాసినో పేరు. దీని ముందు ఓక పెద్ద ఫౌంటైన్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఓక పాట వినిపిస్తుంటారు. వెంటనే, నీరు డాన్స్ చేయడం మొదలెడుతుంది. అందమయిన వాతావరణం లో, అందమయిన పాట వింటూ చూడడం అద్బుతం.



















అలాగే, మరి కొన్ని ఫోటోలు :








ఈఫిల్ టవర్ కాదు ...















బొమ్మలా ఉంది కదా ...











కాసినో లోపల ...

















లాస్ వేగాస్ ... పగలు ... రాత్రి ...




















అలా చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. కొన్ని చోట్ల మాటల్లో చెప్పలేనిది, ఫోటోలు చెబుతాయి. అలాగే ఓక సర్కస్ కూడా చూసాం. బావుంది. మళ్లీ కాసినోలలోకి ఎంటర్. బేసిక్ గా మన దగ్గర డబ్బులు లేకపోయినా , మిగతా వాళ్ళ ఆటలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేను అయితే, ఆదివారం రాత్రి మూడు గంటలకు పడుకుండి పోయాను. మిగతా వాళ్ళు ఏ అయిదు గంటలకో వచ్చారు.

అంతే , అయిపోయింది. టైం అయిపోయింది. మొత్తమంతా చూడకుండానే, సోమ వారం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాల్సి వచ్చింది. సోమవారం ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాం . మళ్లీ వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం.

మరి కొన్ని, అద్బుతమయిన కొండలను చూసాను :






















































సారి చికాగో రావడానికి, ముప్పయి ఆరు గంటలు పట్టింది. జితన్, వంచి ఇద్దరూ అలసి పోయారు. మంగళవారం ఉదయం మూడు గంటలకు కారును ఎక్కడో ఆపేసి, అందరం పడుకుండిపోయాం. వచ్చేటపుడు చూడాలి, మళ్లీ డెన్వర్ దగ్గర, మంచు లో తడిచిన కొండలు. అద్బుతం. ఈసారి ఎప్పుడయినా అక్కడకు వెళ్ళాలి, చలికాలం లో, కారు వేసుకుని.
వంచి డ్రైవ్ చేస్తున్నాడు. నిద్ర వస్తుందేమో. కారు రోడ్డు చివరకు వెళ్ళిపోతుంది. నాకు టెన్షన్ మొదలయింది. అందుకే సరిగా చూడలేకపోయాను.

అలా , అలా వచ్చేటప్పటికి మంగళ వారం రాత్రి పది గంటలు అయింది. కథ కంచికి ... మనం ఇంటికి ... నాకు అనిపించింది ... ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి ... అద్బుతమయిన నికాన్ కెమెరా కొనాలి అని...







జితన్, శ్రీకాంత్, వంచి ...









Continue Reading →

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts