నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా 'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ?
అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి వెళ్ళి వచ్చి ఇక్కడ దిగాను ... నేను, హరిగాడు ఆటోలో దిగాం ... అప్పటికే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆ రోజున జాయిన్ అవుతున్న ముప్పై రెండు మంది పేర్లు ఉన్నాయి ... మా దగ్గర ఆఫర్ లెటర్స్ వెరిఫై చేసి లోపలికి పంపించాడు ... అప్పటికే ఇద్దరు అందమయిన అమ్మాయిలు కూర్చున్నారు ... నేను, మా హరిగాడు వాళ్లకు ఎదురుగా కూర్చున్నాం ... పలకరించుకోలేదు గాని ... నేను ఆ ఇద్దరిలో పొట్టి అమ్మాయినే చూస్తున్నాను ... దేవుడు కొంచం పొడుగ్గా పుట్టించొచ్చు కదా ఈ అమ్మాయిని అనుకున్నాను ... కొంతసేపటికి అందరూ వచ్చేశారు ... ఎవరికి వారు బాచ్ లుగా విడిపోయారు ... ఇంట్రడక్షన్, బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చెయ్యడం, ఆఫీసులో అటూ, ఇటూ తిరగడం ... అలా, అలా గడచిపోయింది ... పెద్దగా ఎవరినీ పలకరించలేదు ...
మా బాచ్ లో దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ... ఒక లవ్ మారేజ్ కూడా ... రెండోది కూడా 'ఆన్ ది కార్డ్స్' ... చెత్త లాగ నేనూ ఉన్నాను ... ఒక లవ్వు లేదు, ఒక పెళ్లి లేదు ...
1 comments:
ఎందుకంత తొందర?:):):)
Post a Comment