ప్రయాణం లో పదనిసలు ఏమిటి అంటే, ఓక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. అది వదిలేసి నేను బయలుదేరాను. నా ఐడియా ఏమిటి అంటే, తెల్లవారు జామున రెండు గంటలకు నెట్ కు కానెక్ట్ అయ్యి ఏదో ఒకటి చేద్దాం అని. మూడు గంటలకు ఓమహా సిటీ చేరుకున్నాము. ఇంటర్నెట్ ఎక్కడ దొరుకుతుంది అని అలోచించి, పెద్ద, పెద్ద హోటల్స్ లలో వై-ఫై ఉంటుంది అని, వాటిని వెదకడం మొదలుపెట్టాము. Settle Inn అని దొరికింది. పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసి, కారులో నుండే నెట్ కు కనెక్ట్ అయ్యి పని చేయడం మొదలుపెట్టాను. అయిదు అయ్యేటప్పటికి laptop లో చార్జింగ్ అయిపోయింది. మళ్లీ టెన్షన్ మొదలు. ఇంతలో బావ చెప్పిన బంగారు మాట గుర్తుకు వచ్చింది - " 90 % స్టార్ బక్స్ కాఫీ షాపులలో ఇంటర్నెట్ ఉంటుంది" అని. జి.పీ.ఎస్ లో స్టార్ బక్స్ సెట్ చేసి వెళ్ళేటప్పటికి ఆరు అయింది. నా టైం బావుండి అక్కడ పని చేసే అందమయిన అమ్మాయి చెప్పింది. అయిదు డాలర్లు పెట్టి కూపన్ కొంటె రెండు గంటలు నెట్ వాడుకోవచ్చు. పని మొదలెట్టాను. ఎనిమిది గంటల కల్లా పని అయిపోయింది. ఓక ప్రక్కనుండి వీళ్ళ దొబ్బుడు. మెయిల్ కొట్టి, కాఫీ పట్టుకుని బయలుదేరాం. కొంచం టెన్షన్ పడినా, ఇదో మంచి అనుభవం.నా విషయం చివరి వరకూ తెలియకపోవడం వల్ల ఎలా వెళ్తాము, ఎంత దూరం, యెంత సేపు పడుతుంది, ఏమేమి చూడాలి అన్నవి ఆలోచించ లేదు. అమెరికా రోడ్ల మీద గంటకు 80 మైళ్ళకు మించి వెళ్ళలేము. అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది. మాలో జితన్, వంచి కు తప్ప మిగతా ఇద్దరికీ డ్రైవింగ్ రాదు. ఇద్దరు మార్చి మార్చి డ్రైవింగ్ సీర్ మారి, మెక్ డోనాల్డ్ దగ్గర ఆగి, ఫోటోలు తీసుకుంటూ లాస్ వేగాస్ చేరేటప్పటికి శనివారం ఉదయం రెండు గంటలు అయింది. లింకన్ సిటీ దాటిన తరువాత ప్రయాణం ఇక అద్బుతం. ఎందుకంటే రోడ్డుకి ఇరుపక్కలా అంతెత్తున, మంచు తో తడిచి, ఎండలో మెరుస్తున్న అందమయిన కొండలు. వంపులు తిరిగి ఎన్నెన్నో మలుపులున్న రోడ్లు.
రెండు గంటల ప్రయాణం తరువాత యూట లోకి ప్రవేశించాం. ఇక్కడ ఇంకా అద్బుతం. వంద, నూట యాబయి మైళ్ళ వరకూ ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు.ఇక్కడ చాలా జాగ్రత్తగా నడపాలి. తేడా వచ్చిందో ఇంతే సంగతులు.
వెనక సీట్లో జితన్, శ్రీకాంత్ నిద్ర పోతున్నారు. నేను, వంచి మాట్లాడుకుంటూ, మంచులో తడిచిపోయిన కొండలను చూస్తూ వెళ్తున్నాం.
రాత్రి రెండు గంటలు లాస్ వేగాస్ చేరుకున్నాం. అంటే దాదాపు ముప్పయి గంటల ప్రయాణం తరువాత.


దూరం నుండి అంత రాత్రి వేళ లాస్ వేగాస్ లైట్లతో వెలిగిపోతోంది. వెళ్ళిన వెంటనే స్నానాలు చేసి, కదిలేటప్పటికి మూడు అయింది. మేము దిగిన హోటల్ The Signature . బేసిక్ గా లాస్ వేగాస్ ను ఎంజాయ్ ఎంజాయ్ చెయ్యాలి అంటే ఈ రెండింటిలో కనీసం ఒక్క ఇంట్రెస్ట్ అయినా ఉండాలి. నా ఉద్దేశం మిగతా వాళ్ళు ఎంజాయ్ చెయ్యలేరు అని కాదు.
కాసినో అంతా తిరిగి, కొంతసేపు అందరి ఆటలు చూసేటప్పటికి ఆరు అయింది. విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది. వచ్చి పడుకుండిపోయాం. మా హోటల్ నుండి చూస్తే :

లేచి, పన్నెండు గంటలకు కారేసుకుని ఊరు అంతా తిరిగాం . ఎన్నెన్నో వింత, వింత విశేషాలు తెలుస్తున్నాయి.
ముందే చెప్పుకున్నట్లు, ఇక్కడ కాసినోలు, స్ట్రిప్ క్లబ్బులు చాలా ఎక్కువ. రోడ్డు మీద ఎక్కడ చూసినా, అమ్మాయిలు, అమ్మాయిలు అని కార్డులు పంచిపెడుతుంటారు.
ఇదిగో ఇలా :

అమ్మాయిలు ... అమ్మాయిలు ...

అలా వెళ్తుంటే, ఇంకా ఎన్నెన్నో వింతలూ తెలిసాయి. అదేంటంటే
Drive thru marriages. ఏంటంటే, మీకు పెళ్లి చేసుకోవడానికి టైం లేక పొతే, కారు లో కూర్చుని
"I Do"అని చెప్తే పెళ్లి అనిపోయినట్లే.ఇవాల్టి ప్లాన్ నడుచుకుంటూ అంతా చూడాలి అని. వాతావరణం కూడా అద్బుతంగా ఉంది. చల్ల గాలి తో పాటు ఎండ.
అదిరింది.
నీటికి కూడా డాన్స్ వచ్చు అని నాకు ఇది చూసిన తరువాతే తెలిసింది :

వెనకాల కనిపిస్తున్నది - బెల్లాజియో అని కాసినో పేరు. దీని ముందు ఓక పెద్ద ఫౌంటైన్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఓక పాట వినిపిస్తుంటారు. వెంటనే, నీరు డాన్స్ చేయడం మొదలెడుతుంది. అందమయిన వాతావరణం లో, అందమయిన పాట వింటూ చూడడం అద్బుతం.


బొమ్మలా ఉంది కదా ...
కాసినో లోపల ...
లాస్ వేగాస్ ... పగలు ... రాత్రి ...
అంతే , అయిపోయింది. టైం అయిపోయింది. మొత్తమంతా చూడకుండానే, సోమ వారం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాల్సి వచ్చింది. సోమవారం ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాం . మళ్లీ వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం.
మరి కొన్ని, అద్బుతమయిన కొండలను చూసాను :



అలా , అలా వచ్చేటప్పటికి మంగళ వారం రాత్రి పది గంటలు అయింది. కథ కంచికి ... మనం ఇంటికి ... నాకు అనిపించింది ... ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి ... అద్బుతమయిన నికాన్ కెమెరా కొనాలి అని...
జితన్, శ్రీకాంత్, వంచి ...





1 comments:
మీ ప్రయాణానుభవాలు కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సారి వెళ్లినప్పుడు Dance show -Jubilee at Bally's Hotel, Las Vegas చూడటం మరువవొద్దు. ఒక గొప్ప అనుభూతిని కోల్పోతారు. Word verification తీసివెయ్యగలరు.
Post a Comment