అదేంటో లైఫ్ లో అపుడపుడు భయం వేస్తుంటుంది ... ఎం.సి.ఏ. చదివి మూడు సంవత్సరాలు అయిందా ... కాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ... భాగ్యనగరంలోనే జాబు ... ఈ మూడు సంవత్సరాలు లోను మూడు ప్రాజెక్ట్స్ ... మాములుగా అయితే ఒకే ప్రాజెక్ట్ లో ఉంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది ... ప్రతి ఒక్కడు అడుగుతాడు ... ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అని ... ఎవరయినా బందువుల ఇంటికి వెళ్తే మనల్ని వేరే వాళ్లతో పోల్చడం మొదలుపెడతారు ... మా వాడు అమెరికా వెళ్ళాడు ... నలబయ్ లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు అని ... మనం ఎప్పడు వెళ్తాం అనిపిస్తుంది ... వచ్చే మే కి ఇరవయ్ ఆరు సంవత్సరాలు నిండుతాయి ... బావ చెప్పినట్టు పెళ్లి అంటు చేసుకుంటే ఇరవయ్ ఏడు లోనే చేసుకోవాలి ... ఇప్పటి వరకు మనకి ఎవరు ప్రపోజ్ చెయ్యలేదు ... మనం ఒక అమ్మాయిని ఇష్టపడ్డం జరిగింది ... కానీ ఏం లాభం ... తను కూడా ఇష్టపడాలి కదా ... అలా అయింది ... మొన్న అన్నయ్య పెళ్లి అయింది ... ఒక్క అమ్మాయి రాలేదు ... ఛీ ... ఛీ ... ప్రతి వారం స్వాతి చదువుతాను ... సరసమయిన కథ వదలకుండా ... వయసు వల్ల అయితేనేమి ... ఇటువంటి కథలు చదవడం వల్ల అయితేనేమి ... అన్నయ్య కు పెళ్లి అయిపొయింది ... ఇక నీకు లైన్ క్లియర్ అయిపోయినంటే అని అందరు అనడం వల్ల అయితేనేమి ... ఎపుడెపుడు పెళ్లి చేసుకుంటామా అనిపిస్తుంది ... అపుడెపుడో ఒక కథ చదివాను ... అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ ... రెండు చేతులతోనూ ఆమె తలను పట్టుకుని ... దగ్గరగా ... అంటే , వెచ్చటి ఊపిరి లు తెలిసేలా ... తన పెదాలతో ఆమె ఎర్రని పెదవుల మీద సంతకం పెడతాడు ... యెంత రొమాంటిక్ గ ఉందొ కదా ... మరి మనకి ఎప్పుడు వస్తుందో ఆ ఛాన్స్ ... రోడ్ మీద ఈ అమ్మాయి కనిపించినా తల ఆటోమాటిక్ గ అటు తిరిగిపోతుంది ... సో, కాస్త భయపడడం లో అర్థం ఉంది కదా ...
Sunday, November 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
Recent Posts
Categories
- m (1)
Unordered List
Text Widget
Pages
Total Pageviews
Welcome
నేను చూసేవి ...
Featured Coupons
నేను ... నా గురించి
Blogger news
Contact Form
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
3 comments:
Ravi i never expect that you think about girls in this way, at that time we are in degree i and rama reddy talk about girls but at that time you are not that much involved now i see a different ravi ..... who brings this change
hahahaha... jagratha nestam.
జాగ్రత్త నేస్తం !
Post a Comment