Sunday, November 2, 2008

వెన్నెల కురిపించే చందమామ ... ఎక్కడున్నావు ...


ఎంత తేడా !!! సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ... ఇప్పుడు ఎలా ఉంది ... క్లాసులు అయిన తరువాత ఫ్రెండ్స్ అందరం రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ... ట్రాఫిక్ అసలు ఉండేది కాదు ... మరి ఇప్పుడో , ఇది మరో అమీరపేట్ లా తయారయింది ... ఆర్. ఎస్ అన్నదమ్ములు, కళానికేతన్, కళామందిర్, జే. సి. అన్నదమ్ములు, ఇంకా చాలా చాలా షాపింగ్ మాల్స్ వచేసాయి ... ఇవి చాలవు అన్నట్లు రోడ్ ప్రక్క బళ్ళమీద ఉండేవి ఎలాను ఉంటాయి ... చాల ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టుప్రక్కల ఉండటంతో అమ్మాయిల హాస్టల్స్ వచ్చేశాయి ... శనివారం, ఆదివారం సాయంత్రాలు అలా వెళ్లి చూడు మామా ... కళ్ళకు పండగే ... అందంగా తయారయి ... ఫ్రెండ్స్ ని వేసుకుని షాపింగ్ చేసేస్తూ ఉంటారు ... కొంతమంది వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ తోను, కొంతమంది వాళ్ల శ్రీవారి తోను .... అలా అలా ... బైక్ మీద కుర్చుని ... నడుం మీద చేయి వేసి ... అబ్బాఎప్పుడు వస్తుంది ఆ అదృష్టం ... ఏ అమ్మాయిని చూసినా బావుంటుంది ... అలా చూడటం తప్పా ?? ఏం కాదు ... ఈ ట్రాఫిక్ కు కారణం ఏమిటి అంటే ... జే.యెన్.టి.యు నుండి హై టెక్ సిటీ కి రోడ్డు పడడం ... ఇళ్ళ అద్దెలు అమాంతం పెరిగిపోయాయి ... ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి ... మనల్ని కూడా ... ఒక అందమయిన, మంచి అమ్మాయి ఇష్టపడి, ఇద్దరి మధ్యా మంచి నమ్మకం ఉండి ... సరదాగా అలా అలా తిరిగి , పెళ్లి చేసుకుంటే యెంత బావుండును ... నాకు అనిపిస్తుంది ... ఈ జన్మకు ఆ అదృష్టం లేదు ఏమో ... అదేంటో పెద్దలు కుదిర్చిన పెళ్లి మీద నాకు అంత మంచి అభిప్రాయం లేదు ... ఎందుకంటే ... అమ్మాయి గురించి అబ్బాయికి తెలియదు ... అతని గురించి ఆమెకు తెలియదు ... ఫొటోలతో మొదలవుతుంది ... పెళ్లి చూపులలో ఒక అరగంట మాట్లాడుకోనిస్తారు ... ఒక మనిషిని అరగంట లో అర్థం చేసుకోవడం జరుగుతుందా ?? అయినా సరే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఎలా నిలవగలుగు తున్నాయి ? ... బహుశా ... పెళ్లి అయిన తరువాత ... ఏమో మనకు అర్థం కాదు ... నన్ను ఎవరు అయినా అర్థం చేసుకోవడం కష్టం అని నా మీద నాకు ఉన్న అభిప్రాయం ... మరి మనకి ఏమి జరుగుతుంది ... బావ కి జాతకం మీద నమ్మకం ఎక్కువ ... నా జాతకం చూసాడు ... నీది పెద్దలు కుదిర్చిన పెళ్లి రా అన్నాడు ... పెళ్లి తరువాత నా లైఫ్ మారిపోతుందట ... నిండు వెన్నెలలో , ఆరు బయట పడుకుంటే యెంత హాయిగా ఉంటుందో , నీ లైఫ్ అంట హాయిగా సాగిపోతుంది అన్నాడు ... తను చందమామ అంత అందంగా ఉంటుందట ... బావ ఈ మాట ఎప్పుడు చెప్పినా నా మనసు బజాజ్ - పల్సర్ మీద పరుగెడుతుంది ...
చూడాలి మరి ... ఏమి అవుతుందో ...

0 comments:

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts