Saturday, November 8, 2008

ప్రేమలు ... పెళ్ళిళ్ళు ... జీవితం ...

ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు ... ఎలాగా అని ఆలోచిస్తున్నాను ... అసలు ప్రేమంటే ఏంటి ? ... వ్యామోహమా ... ఆకర్షణా ... అర్థం చేసుకోవడమా ... ఇంకా ఏమన్నానా ??? ... అది చిన్న వయసులో మొదలవుతుందా ... లేక ఈ టైములో పుడుతుంది అని ఏమి అన్నా ఉందా ??? స్నేహం ప్రేమగా మారవచ్చా, లేక అలా మారడం తప్పా? ... ఎక్కడో చదివాను ... కొంతమంది ప్రేమించడం, లేదా ప్రేమించబడడం కన్నా తాము ప్రేమలో ఉన్నాము అన్నా ఫీలింగ్ నే ఇష్టపడతారట ... మా బావ అపుడెపుడో చెప్పాడు ... ప్రేమంటేనే నిజం ... ఇక నిజమయిన ప్రేమ, అబద్దమయిన ప్రేమ ఎక్కడయినా ఉంటాయా ? అని. " నిప్పు అంటేనే కాలేది ... ఇక కాలే నిప్పు, కాలని నిప్పు ఉండవు అని " ... మరి అది నిజమయితే కొంతమంది కొంతకాలం కలిసి తిరిగి, రాత్రి పూట గంటలు, గంటలు మాట్లాడుకుని, అందరి లోను తాము ప్రేమలో ఉన్నాము అన్నఫీలింగ్ కలిగించి , కొంతకాలం తరువాత విడిపోతారు ... అంటే వారిది ప్రేమ కాదా ? ... అసలు ఒకరిని ప్రేమించి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా ? ...
...
నాకు తెలిసి ఎవరూ ప్రేమ ఇదీ అని నిర్వచనం ఇవ్వలేరు ... ఇది అంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నా చుట్టూ ఉన్న చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం చేతా, చాలా మంది ప్రేమలు విఫలం అవ్వడం చేతా, నేను కూడా ప్రేమిస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉండడం చేతా ... ప్రేమ అంటే కేవలం మానసికమా , లేక శారీరకం కూడానా ? ... ఏమో ... నేను ఏమి అనుకుంటున్నాను అంటే ప్రేమ ఆకర్షణ తోనే మొదలవుతుంది , ఈ ఆకర్షణ అందం కావచ్చు ... లేక అవతలి వారిలో టాలెంట్ కావచ్చు ... సరే, ఒకడున్నాడు , ఒక అందమయిన అమ్మాయిని చూసాడు ... ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తారు ... ఇద్దరికీ పరిచయం ఉంది ... అమ్మాయి నచ్చింది ... నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ... కాని ఆ అమ్మాయికి వీడి మీద అటువంటి ఫీలింగ్స్ ఏమి లేవు ... ఇక్కడ వాడికి ప్రేమేనా ? ... ప్రేమ అంటే రెండు వైపులా నుండి ఉండాలి కదా !!! వీడికి నచ్చినంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా ??? ... సరే, ప్రేమ గురించి మాట్లాడడానికి మనం సరిపోము ... ఇక్కడితో వదిలేద్దాం ...
............
కొంత వయసు వచ్చిన తరువాత మనసు, శరీరం తోడు కోరుకుంటాయి ... చిన్నప్పుడు ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు కాని...తరువాత తరువాత మొదలవుతాయి...మన ఫీలింగ్స్ పంచుకోవడానికి, మన బాగోగులు చూడడానికి ఎవరైనా ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది ... ఎక్కడో చదివాను, పెళ్ళంటే ఒక ఆడ, మగా కలిసి ఉండడానికి సమాజం విధించిన కట్టుబాటు అని...పెళ్లి అయిన తరువాత లైఫ్ స్టైల్ మారిపోతుంది ... మనం ఇంకా బాధ్యతగా ఉండాలి ...
...
అదేంటో, ఈ మధ్య పెళ్లి గురించిన ఆలోచనలు పెరిగిపోతున్నాయి ... ఇప్పటివరకు అనుకున్నాను నేను ఒక్కడినే ఇలా ఫీల్ అవుతున్ననా అని , కాని విషయం ఏమిటి అంటే, పవన్ గాడు, సాయి కిషోరు, ఇంకా చాల చాలా మంది నాలాగే ఆలోచిస్తున్నారు అని. కాని ఇంకో ప్రశ్న భయపెడుతూ ఉంటుంది ... ఇప్పటి వరకు ఏమి సాధించాము ... బ్యాంకు అకౌంటు లో డబ్బులు ఏమి ఉన్నాయి అని ... ఇంకో వైపు, ఏ అందమయిన జంట ను చూసినా అనిపిస్తుంది ... మనకూ ఇంత అందమయిన అమ్మాయి దొరుకుతుందా అని ... భవిష్యత్తుని గురించి ఆలోచిస్తే వర్తమానాన్ని ఎంజాయ్ చేయలేం అంట ... ఇది తెలిసి కూడా రేపటి గురించి ఎందుకు అలొచిస్తమో నాకయితే అర్థం కాదు ...
...
అమ్మాయిలు కూడా జాబ్ చేస్తే వాళ్లకు ఆర్ధిక ఫ్రీడం ఉంటుంది ... ఎవరి మీదా ఆధారపడవలసిన అవసరం ఉండదు ... అపుడు అబ్బాయిలు తమ ఆధిపత్యం చూపించలేరు ... అంటే అందరు అబ్బాయిలు చెడ్డ వారని కాదు ... మా బావ లాంటి వాళ్లు కూడా ఉంటారు ... కాని విషయం ఏంటి అంటే, మా ఆఫీసు లో చూస్తుంటాను కదా .... అమ్మాయిలు సాయంత్రం ఏడు, ఎనిమిది వరకు ఉంటారు ... ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతారు ... అబ్బాయిలు ఎలాగు జాబ్ చేయాలి ... ఇక ఇద్దరూ అలసిపోతే ఇంక ఏమి ఎంజాయ్ చేస్తారు ... లైఫ్ అంటే డబ్బులు ఒక్కటే కాదు కదా ... నా అభిప్రాయం తప్పు కావచు ... బట్, నేను ఇలా ఫీల్ అవుతున్నాను ...
...
బావ అన్నాడు, గాలి, నీరు, ఆకాశం ఎలాగో డబ్బు కూడా అలాగే ... దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అని ... ఏమో ... ఇంకొక విధమయిన ఫీలింగ్ తరుముతూ ఉంటుంది ... మనతో పాటు చదివిన వాళ్లు, మన తోటి వాళ్లు విదేశాలు వెళ్లారు ... మనము ఎప్పుడు వెళ్తాము అనిపిస్తుంది ... ఎందుకంటే డబ్బుల కోసం ... నాకు ఆ ఫీలింగ్ అంత ఎక్కువ లేదు అనుకో ... ఎందుకంటే, మనకు లేని వాటిని గురించి ఆలోచిస్తే , మనకు ఉన్న వాటి విలువ తెలియదు ... ఏది జరిగినా మన మంచికే అని నా నమ్మకం ... కాబట్టి నేను ఆనందంగానే ఉన్నాను ... అసలయిన భయం ఇంకొకటి ఉంది ... అదేంటంటే ... జుట్టు రాలిపోవడం ... హైదరాబాద్ లో ఉండడం వలన, నాన్న కు బట్ట తల ఉండడం వలన, మనకు కూడా వస్తుందేమో అని భయం ... మనం చూడడానికి బాగానే ఉంటాము ... కాని రెండు సంవత్సరాల తరువాత ... ఏమో ... ఆ దేవుడికే తెలియాలి ...
...

స్వాతి లో సరసమయిన కథలు ఉంటాయి కదా ... రచయితలకు ఆ ఆలోచనలు ఎట్లా వస్తాయో ... అమ్మాయిలను నుదురు నుండి పాదాల వరకు వర్నించేస్తుంటారు .... చిన్నప్పటి నుండి ఇటువంటి కథలు చదవడం వల్లనో ఏమో, అటువంటి అందమయిన అమ్మాయిని కోరుకుంటున్నాం ... తప్పు లేదు కదా ... ఉంటారు ... ఎందుకో తెలియదు .... ఇటువంటి అందమయిన కథలు చదువుతూ ... ఇంత అందమయిన అమ్మాయిలను చూతూ మామూలుగా ఉండడం అంటే మాటలు కాదు ...
...కాలమే సమాధానం చెబుతుంది ... చూద్దాం ... ఎం జరుగుతుందో ...

1 comments:

Anonymous said...

అమ్మాయిలు సాయంత్రం ఏడు, ఎనిమిది వరకు ఉంటారు ... ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతారు ... అబ్బాయిలు ఎలాగు జాబ్ చేయాలి ... ఇక ఇద్దరూ అలసిపోతే ఇంక ఏమి ఎంజాయ్ చేస్తారు ...

still can enjoy if one is tired???

Popular Posts

Recent Posts

Categories

  • m (1)

Unordered List

Text Widget

Pages

Total Pageviews

Welcome

నేను చూసేవి ...

Featured Coupons

నేను ... నా గురించి

Blogger news

Contact Form

Name

Email *

Message *

Popular Posts